విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్‌గా ఎదిగారు హీరో విక్టరీ వెంకటేశ్. నేడు (13 డిసెంబర్) ఈ అగ్రకథనాయకుడు 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన స్నేహం, అప్యాయతను తెలియజేస్తూ.. ‘‘నా ప్రియమైన వెంకీ మామకు సంతోషకరమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వెక్కడికి వెళ్లినా ఆప్యాయత, సానుకూలత పంచుతావు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా షూటింగ్ సమయంలో మనం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతో విలువైనది’’ అంటూ ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే, వెంకటేష్‌కు రాబోయే సంవత్సరం ఆనందంగా, సంతోషంగా, శుభప్రదంగా ఉండాలని, దైవ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని చిరంజీవి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌లో పెద్ద ఎమోషన్ క్రియేట్ చేసింది. చిరంజీవి – వెంకీ మామ మధ్య ఉన్న స్నేహానికి ఈ హృదయపూర్వక విష్ మరోసారి సాక్ష్యం అయ్యింది. ఇదిలా ఉండగా సినీ ప్రముఖులు చాలా మంది ఎక్స్ వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ఈ సందర్బంగా ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ వెంకటేశ్‌కు సంబంధించిన మ్యాష్‌అప్ వీడియోను షేర్ చేసింది. అందులో ఆయన సినిమాల్లోని డైలాగులతో పాటు టాలీవుడ్ హీరోలు వెంకటేశ్ గురించి చేసిన కామెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. వెంకటేశ్ ఆవకాయ లాంటి వాడని.. ఆయనను ఇష్టపడని తెలుగు ఆడియన్స్ ఉండరని హీరో నాని అన్నారు.
విక్టరీ వెంకటేశ్ కు మెగాస్టార్ చిరంజీ బర్త్ డే విషెస్
