అఖిల్ రాజ్ హీరోగా ‘అర్జునుడి గీతోపదేశం’

Akhil Raj as the hero in 'Arjunudi Geetopadesam'
Spread the love

‘రాజు వెడ్స్ రంబాయి’ ఫేమ్ అఖిల్ రాజ్ – దివిజ ప్రభాకర్, ఆదిత్య శశికుమార్, సదన్, వసంతిక మచ్చ, హీరో హీరోయిన్స్ గా రూపొందుతున్న చిత్రం ‘అర్జునుడి గీతోపదేశం’. వరలక్ష్మి శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సతీష్ గోగాడ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఫస్ట్ కట్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై త్రిలోక్ నాథ్ కాళిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 80శాతం షూట్ హైదరాబాద్, రాజమండ్రి, అమలాపురం పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఆఖరి షెడ్యూల్ డిసెంబర్ లో మొదలవుతుందని చిత్ర నిర్మాత త్రిలోక్ నాథ్ కాళిశెట్టి తెలిపారు. ఈ చిత్రంలో ఆదిత్య శశికుమార్, సదన్, వసంతిక మచ్చ, రాజీవ్ సాలుర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం చైతన్య కందుల, ఎడిటర్ ఎం.ఎన్ అర్జున్. నటీనటులు: అఖిల్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, దివిజ ప్రభాకర్, ఆదిత్య శశికుమార్, సదన్, వసంతిక మచ్చ, రాజీవ్ సాలుర్, దర్శకత్వం: సతీష్ గోగాడ, నిర్మాత:  త్రిలోక్ నాథ్ కాళిశెట్టి, బ్యానర్: ఫస్ట్ కట్ ఫిలిం ఫ్యాక్టరీ, సంగీతం: చరణ్ అర్జున్, డీవోపీ: చైతన్య కందుల, ఎడిటర్: ఎం.ఎన్ అర్జున్, పీఆర్వో: తేజస్వి సజ్జా

Related posts