త్రివిక్రమ్ చేతుల మీదుగా ‘సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడు’ గా ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 9’ చిత్రం ప్రారంభం

renowned Director Trivikram honoured the Puja ceremony and clapped the Sithara Entertainments movie, Production No. 9, which goes to sets featuring Siddhu Jonnalagadda.
Spread the love

శౌరి చంద్రశేఖర్ టి. రమేష్ దర్శకుడు గా పరిచయం
ఉదయం 9.09 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు

రుస చిత్రాల నిర్మాణంలోనేకాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న నూతన చిత్రం ( ప్రొడక్షన్ నంబర్ 9 ) ఈ రోజు సంస్థ కార్యాలయంలో ఉదయం 9.09 నిమిషాలకు పూజా కార్యక్రమాల తో ప్రారంభమైంది.
ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ దేవతామూర్తుల ముందు క్లాప్ నివ్వడం తో చిత్రం ప్రారంభ మయింది. హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ(చినబాబు)స్క్రిప్టు ను చిత్ర దర్శకుడు కి అందించారు.
సిద్దు జొన్నలగడ్డ ప్రధాన నాయకుడు గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు తెలుగులో ఇదే తొలి చిత్రం. శౌరి చంద్రశేఖర్ టి. రమేష్ దర్శకుడు గా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు.
గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది.
‘ప్రేమ’ లోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి అని తెలిపారు చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ టి. రమేష్.
నేడు పూజా కార్యక్రమాలు తో ప్రారంభమైన ఈ చిత్రం ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతరపాత్రల్లో నటీ నటులు ఎవరన్నది త్వరలో ప్రకటించటం జరుగుతుంది.

సాంకేతిక నిపుణులు:
ఛాయాగ్రహణం: వంశీ పచ్చి పులుసు
సంగీతం: స్వీకార్ అగస్తి
మాటలు: గణేష్ కుమార్ రావూరి
ప్రొడక్షన్ డిజైనర్: వివేక్ అన్నామలై
పి.ఆర్.ఓ: యల్.వేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి

Related posts

Leave a Comment