మెగాస్టార్ ముఖ్య అతిథిగా ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ మొదలైంది..

Prabhas' 'Spirit' begins with the megastar as the chief guest..
Spread the love

>ఎప్పటి నుంచో ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్టు ‘స్పిరిట్‌’. ప్రభాస్‌ హీరోగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు ఆదివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశారు. ఈ సినిమాని ఎప్పుడో అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. సెట్స్‌పైకి వెళ్లడం ఆలస్యమవుతూ వచ్చింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, వివేక్‌ ఒబెరాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారతీయ భాషలతోపాటు జపనీస్‌, కొరియన్‌, మాండరిన్‌లో విడుదల చేయనున్నారు. విజువల్స్‌ లేకుండా కేవలం ఆడియోతో క్రియేట్‌ చేసిన ‘స్పిరిట్‌’ టీజర్‌ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. టి- సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లలో ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీత దర్శకుడు.

Related posts