“అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ” బయోపిక్ టైటిల్ హక్కులు మాకే సొంతం, “ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ” మూవీ నిర్మాతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం – వీఎన్ఆర్ ఫిలింస్

"The title rights for Apara Annapurna Dokka Seethamma biopic belong solely to us; we will take legal action against the producer of Andhrula Annapurna Dokka Seethamma" – VNR Films
Spread the love

అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్ టైటిల్ తో వీఎన్ఆర్ ఫిలింస్ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్ చిత్రానికి ఎ.ఆర్.బి. నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చర్త రాజుబాబు దర్శకత్వం వహిస్తున్నారు.
అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్ టైటిల్ హక్కులు తమకే సొంతమని, ఈ టైటిల్ ను ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించామని వీఎన్ఆర్ ఫిలింస్ వెల్లడించింది. అయితే ఎలాంటి టైటిల్ రిజిస్ట్రేషన్ లేకుండా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ టైటిల్ తో ఊషారాణి మూవీస్ బ్యానర్ లో వల్లూరి రాంబాబు నిర్మాతగా, రవి నారాయణ్ దర్శకుడిగా సినిమా రూపొందిస్తున్నారు.
ఈ విషయంపై వీఎన్ఆర్ ఫిలింస్ స్పందిస్తూ – అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్ టైటిల్ ను మేము ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించాం. అయితే ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ టైటిల్ తో ఊషారాణి మూవీస్ సినిమా రూపొందిస్తోంది. ఈ చిత్ర దర్శకుడు రవి నారాయణ్ మమ్మల్ని గతేడాది టైటిల్ ఇవ్వమని అడిగారు. మేము సినిమా చేస్తున్నాం కాబట్టి టైటిల్ ఇవ్వడం కుదరదు అని తేల్చిచెప్పాం. అయినా కూడా మా అనుమతి లేకుండానే ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ టైటిల్ తో సినిమా షూటింగ్ చేస్తున్నారు. మాకు చెందిన టైటిల్ తో మరే దర్శక నిర్మాత సినిమా రూపొందించినా చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఉషారాణి మూవీస్ పై చర్యలకు ఉపక్రమిస్తున్నాం. అని తెలిపింది.

Related posts