నేషనల్ క్రష్ రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి ‘ఏం జరుగుతోంది…’ లిరికల్ సాంగ్ రిలీజ్

National Crush Rashmika releases lyrical song 'What's happening...' from 'The Girlfriend'
Spread the love

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. తాజాగా “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా నుంచి ‘ఏం జరుగుతోంది…’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా, చిన్మయి పాడారు. హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఛాట్ బస్టర్ ట్యూన్ అందించారు. ‘ఏం జరుగుతోంది…’ పాట ఎలా ఉందో చూస్తే – ‘ కలకలమను కలగలిపిన కథ మొదలా, కలవరమున తెగనలిగిన నిజము కలా, ఏం చేయను తడబడిన తప్పటడుగా, మతిచెడెనా ఏమో, సతమతమౌ తలపేదో, నిలదీసి నన్నెడుగెనుగా, ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది, మనసా తెలుసా, మనసా తెలుసా, ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది…’ అంటూ హార్ట్ టచింగ్ లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.
నటీనటులు: రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు
టెక్నికల్ టీమ్:
సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్
సంగీతం – హేషమ్ అబ్దుల్ వాహబ్
కాస్ట్యూమ్స్ – శ్రావ్య వర్మ
ప్రొడక్షన్ డిజైన్ – ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి
పీఆర్ఓ – జి.ఎస్.కే మీడియా,వంశీ కాక
మార్కెటింగ్ – ఫస్ట్ షో
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్స్ – గీతా ఆర్ట్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు – ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
రచన -దర్శకత్వం – రాహుల్ రవీంద్రన్

Related posts

Leave a Comment