‘జనం సాక్షి’ ఎడిటర్ రెహమాన్ పై అక్రమ కేసు : ఖండించిన జర్నలిస్టు సంఘాలు

Illegal case against 'Janam Sakshi' editor Rahman: Journalists' associations condemn
Spread the love

‘జనం సాక్షి’ పత్రికా ఎడిటర్ రహమాన్ పై గద్వాల జిల్లా, రాజోలు పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా అక్కడ రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈ ప్రజాస్వామిక ఉద్యమానికి జర్నలిస్టు రహమాన్ తన పత్రికలో మంచి కవరేజి ఇస్తున్నారు. అయితే నిన్న ఆ కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ భారీగా రైతులు పోరాటం చేశారు. ఆ సమయంలో రహమాన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఓ పరీక్ష రాసారు. అయినప్పటికీ అతనిని ఏ2 గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అక్రమం. సదరు కంపెని యాజమాన్యానికి పోలీసులు వత్తాసు పలుకుతుండడం వల్లే ఎలాంటి సంబంధం లేని రహమాన్ పై అక్రమంగా కేసు నమోదు చేశారు. వెంటనే ఈ కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ హెచ్చరించారు.

Related posts

Leave a Comment