న్యూ విజన్ సెల్యూలైడ్స్ బ్యానర్ పై రవి నాలమ్ నిర్మిస్తున్న తాజా చిత్రం అబ్సెషన్ టైటిల్, పోస్టర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ చిత్రాన్ని రాకేష్ శ్రీపాద దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతుంది. టైటిల్ పోస్టర్ ను ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ చేతుల మీదుగా అవిష్కరించారు. పోస్టర్ లాంచ్ చేసిన అనంతరం మూవీ యూనిట్ తో గణేష్ మాస్టర్ మాట్లాడారు.
అబ్సెషన్ టైటిల్ చాలా కొత్తగా ఉందని, హాలీవుడ్ పేరును తలపించేలా ఉందని, పేరు మాత్రమే కాకుండా పోస్టర్ కూడా అలానే ఉందని పేర్కొన్నారు. అనీష్ రాజ్ దేశ్ ముఖ్ అందించే సాంగ్స్ కచ్చితంగా బాగుంటాయని, త్వరగా పాటలు పూర్తి అయితే వినాలని ఉందని అన్నారు. డైరెక్టర్ రాకేష్ శ్రీపాద విజన్ ఎలా ఉంటుందో ఒక పోస్టర్ తోటే చెప్పారు అని తెలిపారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించి మంచి విజయం సాధించాలని గణేష్ మాస్టర్ పేర్కొన్నారు.
హరీష్ వినయ్, వి. ధీరజ్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ చిత్రానికి వనిధర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో రంజిత్ కడియాల పాటలను అందిస్తున్నారు. అబ్సెషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిగొలిపేలా ఉంది. ఈ చిత్రం గురించి త్వరలోనే మరో అప్డెట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
నటీనటులు: హరిష్ వినయ్, వి.ధీరజ్
బ్యానర్ : న్యూ విజన్ సెల్యూలైడ్స్
స్టోరీ-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరెక్షన్ : రాకేష్ శ్రీపాద
ప్రొడ్యూసర్: రవి నాలమ్
మ్యాజిక్ డైరెక్టర్ : అనీష్ రాజ్ దేశ్ముఖ్
సినిమాటోగ్రాఫర్ : వనిధర్ రెడ్డి
లిరిక్స్ : రంజిత్ కడియాల
పీఆర్ఓ : హరిష్, దినేష్