సాంస్కృతిక రత్న రాధాకృష్ణ!

Cultural Gem Radhakrishna!
Cultural Gem Radhakrishna!
Spread the love

సమాజం స్వార్ధపూరితం! కలుషితమయం! అయినా కొందరు మాత్రం ఇంకా విలువలను కాపాడుతూ అక్కడక్కడా ఉన్నారు! అందులో మా జమలాపురం రాధాకృష్ణ గురించి కొంచెం చెప్పుకోవాలి!
ఆయన గురించి ఆయన ఆలోచిస్తారో లేదో కానీ, స్నేహం కోసం మాత్రం సొంత పనులకు కూడా బ్రేక్ వేసి సమయం ఇస్తారు! ఎదుటివారు స్వార్ధంగా ఆలోచించినా ఆయన మాత్రం స్వచ్ఛంగా ప్రేమిస్తారు! ఆయనకు సంస్కృతీ, సంప్రదాయాలు చాలా ఇష్టం! సాంస్కృతిక కార్యక్రమం ఉందని ఆహ్వానిస్తే ఎంత దూరం భారం అయినా సొంత ఖర్చుతో వచ్చేస్తారు! వస్తూ వస్తూ మరో నలుగురిని కారులో తీసుకొచ్చి వారికి సంతోషాన్ని కలిగిస్తారు! సాంస్కృతిక ప్రదర్శనలు చూడటానికి కూడా అదృష్టం ఉండాలంటారు! అంత ఇష్టం ఆయనకు!
కారులో లాంగ్ డ్రైవింగ్ చేయడం ఆయనకు యమ ఇష్టం! ఆత్మీయ మిత్రులు దూర ప్రాంతాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి వెళ్లాలన్న వెనుక ముందు ఏం ఆలోచించరు! పదండీ అంటూ ఆయన అందరిని ఎక్కించుకుని స్వయంగా డ్రైవ్ చేస్తూ డీజిల్ ఖర్చులు కూడా తనే భరించి కార్యక్రమం దగ్గరకు చేరుస్తారు! అది నెల్లూరు కావచ్చు! గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం ఏదైనా కావచ్చు! స్నేహితులతో ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు! కమ్మని శాకాహార భోజనం ఎక్కడ దొరుకుతుందో ఆయనకు బాగా తెలుసు! అక్కడ తినిపించి తృప్తిపడుతుంటారు! ఒకరకంగా చెప్పాలంటే గొప్ప హోస్ట్ మిత్ర రాధాకృష్ణ!
ఖమ్మం జిల్లా జమలాపురం రాధాకృష్ణ ఊరు! ఆయన జమలాపురం జమీందార్ మనవడు! సెంట్రల్ సెన్సస్ డిపార్ట్మెంట్ లో అధికారిగా సేవలు అందించి పదవీ విరమణ పొందారు! పూర్తిగా సాంస్కృతిక రంగానికి అంకితమయ్యారు! కిన్నెర ఆర్ట్ థియేటర్స్ లో కీలక సభ్యులు! రాధాకృష్ణ ఉంటే మద్దాలి రఘురామ్ కు ఆ కార్యక్రమం నడిపించడం నల్లేరు పై నడకే! రాధాకృష్ణ ఉండేది మై హోమ్ అవతార్! అక్కడ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరితో “మన రాధాకృష్ణ” గా గుర్తింపు పొందారు! కొందరంతే, మనసుకు నచ్చిన పని చేస్తుంటారు! రాధాకృష్ణ అంతే! స్నేహితులకు సాయం చేసి, కార్యకర్త గా కార్యక్రమాలకు సహకారం అందించి సంతోషపడుతుంటారు! ఇంతటి గొప్ప మనసు అందరికి ఉండదు! అది రాధాకృష్ణ సొంతం! అలా అని ఆయన పబ్లిసిటీ కూడా కోరుకోరు! ఎంతో సింపుల్ గా ప్రేక్షకుల్లో కూర్చుని ఆస్వాదిస్తుంటారు! రాధాకృష్ణ గారు.. నూటికో కోటికో ఒక్కరు మీలా ఉంటారు! అభినందనలు! రాధాకృష్ణ పుట్టినరోజు స్నేహితులకు పండగరోజు! ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో వారిని మిత్రులంతా కలసి సన్మానించడం జరిగింది. హ్యాపీ బర్త్ డే సార్!
– డా. మహ్మద్ రఫీ