దేశంలో విద్యా, వైద్యం, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ రంగాల్లో విశేషంగా సేవ చేసిన వారిని ప్రోత్సహించేందుకు “పవర్ కారిడార్ నేషనల్ మేగజిన్” వారు అందించే ప్రతిష్టాత్మకమైన పీసీ ఇండియన్ అచీవర్స్ అవార్డ్స్ లో తెలంగాణ బిడ్డ, ప్రముఖ డాక్టర్ కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి వైద్య రంగం విభాగంలో లో బెస్ట్ అచీవర్ అవార్డును అందుకున్నారు. ఇవ్వాల ఢిల్లీలోని హయత్ రిజెన్సీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా సూర్యపవన్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. టైప్-1 చెక్కర వ్యాధి నిర్మూలనలో 23 సంవత్సరాలుగా విశేషంగా వైద్యసేవలు అందిస్తూ.. లక్షలాది చక్కెర వ్యాధిగ్రస్తులను కొత్త జీవితాన్ని అందించినందుకుగాను సూర్యపవన్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. డాక్టర్ కోమటిరెడ్డి సూర్యపవన్ తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే శ్రీ రాజగోపాల్ రెడ్డిగారి అన్న కుమారుడు కావడం విశేషం.
Related posts
-
బాణా సంచా ధరల మోత : ధరలతో కళతప్పుతున పండగలు!
Spread the love by -షేక్ వహీద్ పాషా, సీనియర్ జర్నలిస్ట్ -9848787917 ధరల నేపథ్యంలో పండగలకు కళ తప్పింది. అన్ని... -
ఇద్దరూ ఇద్దరే : పాత్రికేయ దిగ్గజ శిఖరాలు.. పెద్ద పత్రికలను వదిలేస్తున్నారు!
Spread the love ఇద్దరూ ఇద్దరే .. పాత్రికేయ దిగ్గజ శిఖరాలు.. పెద్ద పత్రికలను వదిలేస్తున్నారు! ఇద్దరూ ఇద్దరే! ఇద్దరివీ అద్భుత... -
నేత్రపర్వంగా విశిష్ఠ నృత్యార్పణం !
Spread the love ప్రవాస నర్తకి విశిష్ఠ డింగరి సమర్పించిన భరత నాట్యం నృత్యార్పణం నేత్రపర్వంగా సాగింది. ఆంగికాభినయం, కరణాలతో ఎంతో ఉల్లాసంగా...