23న అశోక్‌ గల్లా చిత్రం టైటిల్‌ టీజర్‌ విడుదల

title Teaser Of Ashok Galla’s Debut Film With Sriram Adittya To Be Out On June 23rd
Spread the love

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అమర రాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అశోక్‌ గల్లా సరసన హీరోయిన్‌గా నిధీ అగర్వాల్‌ నటిస్తోంది. జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చన సౌందర్య కీలక పాత్రధారులు. ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ఓ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌. అశోక్‌ గల్లా గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తుంటుంది. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్‌ ప్రసాద్‌ ఛాయగ్రాహకులుగా పనిచేస్తున్నారు. చంద్రశేఖర్‌ రావిపాటి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు: అశోక్‌ గల్లా, నిధీ అగర్వాల్, జగపతిబాబు, నరేష్, కౌశల్యా, వెన్నెల కిశోర్, సత్య, మైమ్‌ గోపి, అర్చన సౌందర్య, అజయ్‌ ప్రభాకర్‌
సాంకేతిక విభాగం
స్టోరీ, స్క్రిన్‌ ప్లే, దర్శకత్వం: టి. శ్రీరామ్‌ ఆదిత్య
ప్రొడ్యూసర్‌: పద్మావతి గల్లా
బ్యానర్‌: అమర రాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి
మ్యూజిక్‌: జిబ్రాన్‌
సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌
ఆర్ట్‌: ఏ. రామాంజనేయులు
ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి
డైలాగ్స్‌: కల్యాణ్‌ శంకర్, ఠాకూర్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అక్షయ్‌ త్యాగీ, రాజేష్‌
పీఆర్వో: వంశీ–శేఖర్‌

Related posts

Leave a Comment