‘భైరవద్వీపం’ రీ రిలీజ్‌ వాయిదా!?

Nandamuri Balakrishna's all time classic 'Bhairavadweepam' 4K trailer released
Nandamuri Balakrishna's all time classic 'Bhairavadweepam' 4K trailer released
Spread the love

నందమూరి అభిమానులకు బిగ్‌ షాక్‌ తగిలింది. బుధవారం రీ`రిలీజ్‌ కావాల్సిన ‘భైరవ ద్వీపం’ పోస్ట్‌ పోన్‌ అయింది. మూడు దశాబ్దాల కిందట వచ్చిన ఈ ఆల్‌టైమ్‌ క్లాసికల్‌ సినిమాను ముందుగా బుధవారం పెద్ద ఎత్తున రీ`రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. థియేటర్‌ల లిస్ట్‌ను కూడా ప్రకటించారు. అయితే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ లేకపోవడం వల్ల నిర్వాహకులు రీ`రిలీజ్‌ను పోస్ట్‌ పోన్‌ చేశారు. రెండు నెలల తర్వాత నవంబర్‌లో ఈ సినిమాను రీ`రిలీజ్‌ చేయబోతున్నారు. దాంతో సినిమా రీ`రిలీజ్‌ల కోసం కాచుకొని ఎదురు చూసిన అభిమానులకు నిర్వాహకులు నిరాశను మిగిల్చారు. సింగీతం శ్రీనివాస్‌ రావు దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ సినిమా అప్పట్లో సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఫాంటసీ సినిమాలకు బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేసిన సినిమా ఇది. అలాంటి సినిమాను ఇన్నేళ్ల తర్వాత మళ్లీ 4ఐలో రిలీజ్‌ చేస్తున్నామంటే నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు తెగ ఆనంద పడిపోయారు. కానీ ఇలా పోస్ట్‌ పోన్‌ అవడం నిరాశకు గురిచేసింది. ఇక ప్రస్తుతం బాలయ్య ‘భగవంత్‌ కేసరి’ సినిమా చేస్తున్నాడు. అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్‌ కానుంది. శ్రీలీల కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్‌ నటిస్తుంది.