జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సహాయం

Media Academy financial assistance to journalist families
Spread the love

కుటుంబంలో అండగా ఉన్న మనిషిని కోల్పోవడం చాలా బాధాకరం. ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు చనిపోవడం , వారి కుటుంబాలను ఒకే చోట చూడటం బాధగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్ , టూరిజం శాఖామాత్యులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమం కోసం అందజేసే ఆర్థిక సహాయానికై ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి దేశంలోని ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమం మన ముఖ్యమంత్రి, కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం, అన్న అల్లం నారాయణ ఆధ్వర్యంలో,మీడియా అకాడమీ అండగా ఉంటుందని అన్నారు . కష్ట కాలంలో కుటుంబానికి కావాల్సింది ఒక పలకరింపు, మీకు మేము ఉన్నామనే భరోసా, దాన్ని అకాడమీ ఇవ్వడం చాలా గొప్ప సహాయం.అచ్చంపేట జర్నలిస్టు చికిత్స కోసం, ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ క్రింద 40 లక్షలు ఆర్థిక సాయం చేసిన విషయం గుర్తు చేశారు. అనారోగ్యం చేసి జర్నలిస్టు కుటుంబాలకు హాస్పిటల్స్ లో చికిత్స చేసుకోవడానికి, తరవాత సీఎంఆర్ఎఫ్ సహాయం కావాలంటే ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి అకాడమీకి అందచేస్తే, తన పేషీ ద్వారా ముఖ్యమంత్రి గారికి సిఫార్సు చేస్తామని. ఎల్ఓసి రావడానికి కూడా పూర్తి సహకారం అందిస్తానని అన్నారు.
ఈ సందర్బంగా మంత్రి జర్నలిస్తుల కుటుంబాల కోసం, అకాడమీ చేసిన గుర్తింపు కార్డును ఆవిష్కరించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. 2015లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ అకాడమీ సందర్శించి ఐదు గంటలు నిశితంగా చర్చించి, కార్యక్రమాలు ఎలా ఉండాలో, దిశా నిర్దేశం చేశారు ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. వెంటనే 10 కోట్లు విడుదల చేశారు. గత ఎనిమిది సంవత్సరాల్లో ప్రభుత్వం 42 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మీడియా అకాడమీ ఈ మొత్తాన్ని జాతీయ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చిన వడ్డీతో జర్నలిస్టు సంక్షేమానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగంగా చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి లక్ష రూపాయలు, మూడు వేల రూపాయలు నెలవారి పెన్షన్ అందజేస్తున్నామని, వారి కుటుంబంలో ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు చదువుకునే పిల్లలకు ట్యూషన్ ఫీజు కోసం ప్రతి నెల 1000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నామని అన్నారు.
అనారోగ్య లేదా ప్రమాద బారిన పడి పని చేసుకోలేని నిస్సాహాయ జర్నలిస్టులకు 50 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నదని తెలిపారు.
కరోనా కాలంలో జర్నలిస్టులకు అండగా నిలిచి వ్యాధితో చనిపోయిన 70 జర్నలిస్టులకు కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల సహాయం అకాడమీ అందజేసింది. కరోనా మహమ్మారి వ్యాధిగ్రస్తులైన జర్నలిస్టుల చికిత్సకు, వారి నిత్యవసర వస్తువులు అకాడమీ 7 కోట్ల రూపాయలు అందించింది.
మీడియా అకాడమీ ఈరోజు 104 జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నదని, ఇవ్వాళ లబ్ధి పొందిన వారితో కలిసి అకాడమీ 600 పైగా జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందజేసిందని, దీనికోసం ఇప్పటివరకు అకాడమీ 19 కోట్ల రూపాయలు సహాయం అందించిందని అల్లం నారాయణ అన్నారు.
కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమం అంటే ఎస్సి, ఎస్టీ ,బీసీ, మైనార్టీ కోసం చేసే కార్యక్రమాలని అనుకున్నానని, ఈరోజు మీడియా అకాడమీ ద్వారా ప్రభుత్వం చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కార్యక్రమం ఇంత ఎఫెక్టివ్ గా ఉంటుందన్న విషయం ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తెలిసిందని అన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఒక్క ప్రత్యేక కార్యక్రమం అన్నారు. జర్నలిస్టు సంక్షేమం మేనేజ్మెంట్ బాధ్యత. కానీ తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టు సంక్షేమ నిధి ద్వారా సుస్థిరంగా నీలాదొక్కుకునే కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. జర్నలిస్టు కోసం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం క్రింద 3.5 కోట్లు, సి ఎం ఆర్ ఎఫ్ ద్వారా 2.5 కోట్లు సహాయం అందించిందని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం నుండి మరో 10 నుంచి 15 కోట్లు కేటాయించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి వందన సమర్పణ టి యు డబ్ల్యూ జే జనరల్ సెక్రెటరీ మారుతీ సాగర్ చెశారు. సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు, కిషోర్ బాబు, మీడియా అకాడమీ సెక్రటరీ, వెంకటేశ్వరరావు, మేనేజర్ పిసి వెంకటేశం జర్నలిస్టు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

Leave a Comment