చిత్రం: దిల్ సే
బ్యానర్: సాయి రామ్ క్రియేషన్స్ మరియు శ్రీ చైతన్య క్రియేషన్స్,
నటీనటులు: అభినవ్ మేడిశెట్టి, శాషా సింగ్, లవ్లీ సింగ్, విస్మయ శ్రీ, వెంకటేష్ కాకుమాను ,శివ రామ కృష్ణ బొర్రా ,తదితరులు
కథ, డైరెక్టర్, నిర్మాత: మంఖాల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని
లైన్ ప్రొడ్యూసర్: పార్థు రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ : శివ రామ కృష్ణ
కెమెరామెన్: రాహుల్ శ్రీ వాత్సవ్
మ్యూజిక్: శ్రీకర్ వెళమురి
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రఘుపతి రెడ్డి.జి
ఎడిటర్: ఉద్ధవ్
కో డైరెక్టర్: శంతన్ గద్వాల్
విడుదల: ఒన్ మీడియా
కథ: హీరో అభినవ్ సరదాగా గడిపే ఒక అబ్బాయి. తను అద్దెకు ఉన్న ఇంటి ఓనర్ కుమార్తె సాషా సింగ్ ను చూసి ఇష్టపడతాడు. అభినవ్ కు ఫ్లాష్ బ్యాక్ లో లవ్లీ సింగ్ అనే అమ్మాయితో కాలేజ్ లో లవ్ చేస్తాడు. ఇది ఇలా ఉంటే అభినవ్ చిన్నప్పటి ఫ్రెండ్ విస్మయ శ్రీ హీరో అభినవ్ ను ప్రేమిస్తుంటుంది. ఇలా ముగ్గురు అమ్మాయిలతో మూడు ప్రేమ కథలు ఉంటాయి. చివరికి అభినవ్ ఎవరిని వివాహం చేసుకున్నాడు అనేది సినిమాలో పెద్ద సస్పెన్స్.
హుశారు సినిమా తరువాత హీరో అభినవ్ మేడిశెట్టి ఈ సినిమాలో బాగా నటించాడు, మంచి గుర్తింపు వచ్చే రోల్ లో నటించి మెప్పించాడు. హీరోయిన్స్ శాషా సింగ్, లవ్లీ సింగ్, విస్మయ శ్రీ వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. వెంకటేష్ కాకుమాను కామెడీ బాగుంది. కథ, డైరెక్టర్, నిర్మాత ఇలా అన్ని భాద్యతలు మంఖాల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని ఇద్దరు కలిసి మంచి టీమ్ వర్క్ గా బాగా చేశారు. కథనం, సంగీతం సినిమాకు బాగా కుదిరింది. యూత్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో బాగున్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ తో చాలా సినిమాలు వచ్చాయి, కొన్ని విజయం సాధించాయి. దిల్ సే సినిమా కూడా అందరిని అలరించే ఒక సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల మదిని గెలుస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠతో సినిమా స్క్రీన్ ప్లే సాగుతుంది. హీరోయిన్లు రోల్స్ గ్లామర్ తో పాటు కథలో ప్రాధాన్యత ఉంది. రెగ్యులర్ కు భిన్నంగా దిల్ సే సినిమా అందరిని ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. సాధారణంగా ప్రేమ కథ అంటే ఎన్నో మలుపులు ఉంటాయి, ఈ దిల్ సే సినిమాలో మలుపులతో పాటు వినసొంపు సంగీతం, అద్భుత లోకేషన్స్ లో చిత్రీకరణ సగటు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. చివరిగా: హృదయాన్ని టచ్ చేసే లవ్ స్టొరీ “దిల్ సే”
రేటింగ్: 3/5