పవర్ స్టార్ స్పీడు మాములుగా లేదుగా! ?

pawankalyan spood mamuluga ledhugaa?!
Spread the love

పవర్ స్టార్ పవన్ కల్యాణ్… తన రాజకీయ పార్టీ జనసేన కార్యక్రమాలలో ఓవైపు బిజీగా ఉంటూనే.. మరోపక్క సినిమాలలో కూడా స్పీడు పెంచుతున్నారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని పూర్తిచేసిన ఆయన.. తాజాగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగులో కూడా ఆయన పాల్గొంటున్నారు. అలాగే, మరోపక్క మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి. దీనికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకోపక్క ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించిన పనులు కూడా చకచకా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో సినిమా విషయంలో కూడా పవన్ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ త్వరలో పవన్ తో ఒక చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి మనకు తెలుసు. ఈ చిత్రానికి దర్శకుడిగా మహేశ్ వర్మకు పవన్ ఛాన్సు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజతో మహేశ్ వర్మ ‘ఖిలాడీ’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పవన్ కోసం ఓ కథను ఆయన సిద్ధం చేసినట్టు, దాదాపు అది ఓకే అయినట్టు చెబుతున్నారు.

Related posts

Leave a Comment