Katha venuka katha Movie Review : స‌స్పెన్స్ -థ్రిల్ల‌ర్ `క‌థ వెనుక క‌థ‌`!

Katha venuka katha Movie Review : స‌స్పెన్స్ -థ్రిల్ల‌ర్ `క‌థ వెనుక క‌థ‌`!
Spread the love

(చిత్రం : `క‌థ వెనుక క‌థ‌`, విడుదల : 12 మే -2023, రేటింగ్: 3/5, న‌టీన‌టులు: విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ, అలీ, సునీల్‌, జ‌య ప్ర‌కాష్‌, బెన‌ర్జీ, ర‌ఘు బాబు, స‌త్యం రాజేష్‌, మ‌ధు నంద‌న్‌, భూపాల్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ఖ‌య్యుం, రూప త‌దిత‌రులు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : కృష్ణ చైత‌న్య‌, నిర్మాత‌: అవ‌నీంద్ర కుమార్‌, నిర్మాణం :  దండ‌మూడి బాక్సాఫీస్‌. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సాయి గొట్టిపాటి, సినిమాటోగ్రాఫ‌ర్స్‌:  గంగ‌న‌మోని శేఖ‌ర్‌-ఈశ్వ‌ర్‌, ఎడిట‌ర్‌: అమ‌ర్ రెడ్డి కుడుముల‌, సంగీతం:  శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్‌, ఫైట్స్: అంజి-రియ‌ల్ స‌తీష్‌)

టాలీవుడ్ లో ప్రస్తుతం స‌స్పెన్స్ -థ్రిల్ల‌ర్ సినిమాల హవా నడుస్తోంది. ఈ చిత్రాల‌కు ప్రేక్షకులు మంచి ఆదరణ కనబరుస్తున్నారు. అందుకే అంతటి డిమాండ్ ఉంది. తాజాగా ఇదే జానర్ లో దండ‌మూడి బాక్సాఫీస్ బ్యానర్ పై  కృష్ణ చైత‌న్య అనే నవతరం దర్శకుడితో `క‌థ వెనుక క‌థ‌` చిత్రాన్ని నిర్మించారు నిర్మాత‌ అవ‌నీంద్ర కుమార్‌. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ, అలీ, సునీల్‌, జ‌య ప్ర‌కాష్‌, బెన‌ర్జీ, ర‌ఘు బాబు, స‌త్యం రాజేష్‌, మ‌ధు నంద‌న్‌, భూపాల్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ఖ‌య్యుం, రూప త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి సంబంధించి ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. టైటిల్ ద‌గ్గ‌ర నుంచి పాట‌లు, టీజ‌ర్ , ట్రైల‌ర్ తో ఆక‌ట్టుకున్న ఈ సినిమా ప్రేక్ష‌కుల్లో విడుద‌ల‌కు ముందే క్యూరియాసిటీ ఏర్ప‌రిచింది. మ‌రి 12, మే-2023న విడుద‌లైన ఈ చిత్రం థియేట‌ర్స్ లో ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకుందాం…

 క‌థ‌ : సినిమా దర్శకుడు కావాల‌న్న‌ది అశ్విన్ (విశ్వంత్) క‌ల‌. ఈ క్ర‌మంలో త‌న మామ కూతురు శైల‌జ‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఓ చక్కటి చిత్రాన్ని తీసి హిట్ కొడితేనే త‌న కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాన‌ని కండీష‌న్ పెడ‌తాడు మేన‌మామ‌. దీంతో ఎంతో మంది నిర్మాత‌ల‌కు కథలు వినిపిస్తాడు. ఈ నేపథ్యంలో ఓ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి త‌న‌తో సినిమా తీయ‌డానికి ముందుకొస్తాడు. సినిమా షూటింగ్ పూర్త‌యి… విడుదల ద‌గ్గ‌ర ప‌డే స‌మ‌యంలో ప్ర‌మోష‌న్స్ కు డ‌బ్బులు లేవని నిర్మాత షాక్ ఇస్తాడు. దీంతో అశ్విన్ డిప్రెష‌న్ కి లోన‌వుతాడు. ఇంత‌లో అశ్విన్ సినిమా న‌టీన‌టులు  క‌న‌ప‌డ‌కుండా పోతారు. అలా క‌న‌ప‌డ‌కుండాపోయిన ఐదుగురిలో రాజు మరణిస్తాడు. రాజు ఎలా చ‌నిపోయాడు? అస‌లు అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న `తెర వెనుక క‌థ‌` న‌టీన‌టులు ఎలా మిస్స‌య్యారు? ఈ కేసును స‌త్య (సునీల్) అనే పోలీస్ ఇన్స్ పెక్ట‌ర్ ఛేదించే క్ర‌మంలో ఎలాంటి నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి? స‌త్య స్టోరి  ఏంటి? అప్ప‌టికే వ‌రుసగా అమ్మాయిలు చ‌నిపోతుంటారు. దానికీ, దీనికీ  ఏమైనా సంబంధాలున్నాయా ఆసక్తికరమైన అనేది మిగ‌తా కథ.

 విశ్లేష‌ణ : మనకు ఈ  `క‌థ వెనుక క‌థ‌` అనే టైటిల్ లోనే విషయమంతా తెలిసిపోతుంది. ఇందులో మ‌ల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయ‌ని. ఈ సినిమాలో దర్శకుడు అశ్విన్ , ప్రొడ్యూసర్ జ‌య ప్ర‌కాష్ , పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించిన స‌త్య… వీరి ముగ్గురి జీవితాల‌కు సంబంధించిన క‌థ ఇది. ఎలాగైనా మంచి సినిమా తీసి హిట్ కొట్టాల‌న్న క‌సి హీరోది.  సినిమా నిర్మించాల‌న్న త‌న కూతురి క‌ల‌ను  నెర‌వేర్చాల‌న్న‌ది ప్రొడ్యూస‌ర్ ప‌ట్టుద‌ల‌,  త‌ప్పు జ‌రిగితే ఎంత దూర‌మైనా వెళ్లే పోలీస్ ఆఫీస‌ర్ స‌త్య‌. కానీ వీరి జీవితాల్లో అనూహ్య‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. అవి  వారి క‌ల‌ల‌ను, వారి ఆశ‌యాల‌ను ఎంతగానో దెబ్బ‌తీస్తాయి. ఆ ప‌రిణామాలు ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఒక  దారుణ‌మైన హ‌త్య‌తో సినిమా ఓపెన్ చేసి ద‌ర్శ‌కుడు ఆడియ‌న్ కి లాక్ వేశాడు. ఆ త‌ర్వాత హీరో విశ్వంత్ ల‌వ్ స్టోరి తో పాటు త‌ను డైర‌క్ష‌న్ చాన్స్ ల కోసం వెత‌క‌డం, నిర్మాతల‌ను క‌ల‌వ‌డం…సినిమా ఓకే కావ‌డం…ఆ సినిమాలో వ‌రుస హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న గ్యాంగ్ న‌టించ‌డం ఇలా ఫ‌స్టాప్ అంతా ఎంతో ఆస‌క్తిక‌రంగా డిజైన్ చేశారు ద‌ర్శ‌కుడు.  ఆ త‌ర్వాత అర్థాంత‌రంగా సినిమా ఆగిపోవ‌డం,  డైర‌క్ట‌ర్ సినిమాకు బ‌జ్ తీసుక‌రావాల‌ని ప్లాన్ చేయ‌డం, మీడియాలో ఈ సినిమా సంచ‌ల‌నంగా మారడం,  ఈ క్ర‌మంలో హీరో అస‌లు ఏం జ‌రుగుతోంద‌ని తెలుసుకొని అస‌లుఈ వ‌రుస హ‌త్య‌ల‌కు కార‌కులు ఎవ‌రో  ఛేదించ‌డం….ఇలా క‌థ అనేక మ‌లుపుల‌తో , ఆడియ‌న్స్ ని థ్రిల్ కి గురి చేస్తుంది. ఫ‌స్టాఫ్ అంతా కొంత స్లో గా సాగినా….సెకండాఫ్ లో వ‌చ్చే ట్విస్టులు సినిమాను నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ‌తాయి.  సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో వ‌చ్చే సునీల్ కి సంబంధించిన సీక్వెన్స్ కూడా కొంత ల్యాగ్ అయిన ఫీలింగ్ వ‌చ్చినా…అస‌లు సునీల్ అలా ఎందుకు మారాడు? అనేది  విష‌యం ప్రేక్షకులకి తెలియాలంటే ఆ మాత్రం త‌ప్ప‌ద‌నిపిస్తుంది.
న‌టీన‌టులు ఎలా చేశారంటే… దర్శకుడిగా అశ్విన్ న‌ట‌న ఓకే అనిపిస్తుంది. సునీల్ క్యార‌క్ట‌ర్ మాత్రం సినిమాకు స‌ర్ ప్రైజింగ్ గా ఉంటుంది. నిర్మాత‌గా చేసిన జ‌య‌ప్ర‌కాష్ న‌ట‌న సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. ర‌ఘుబాబు, మ‌ధునంద‌న్ , స‌త్యం రాజేష్, భూపాల్ , ఖ‌య్యుం పాత్ర‌ల‌ పరిధి మేరకు త‌గ్గ‌ట్టుగా న‌టించారు. కథానాయికకి పెద్ద స్కోప్ లేదు. ఉన్నంతలో ఒకే అనిపించేలా మెప్పించింది.

టెక్నీకల్ విషయాలకొస్తే… ముందుగా మనం ద‌ర్శ‌కుడు రాసుకున్న క‌థ‌, క‌థ‌నాలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇలాంటి మ‌ల్టిపుల్ లేయ‌ర్స్ ఉన్న క‌థ‌ని తెర‌కెక్కించ‌డం అంతా ఆషామాషీ విష‌యం కాదు. అలాంటి కథను ప్రేక్షకులు మెచ్చేలా రూపొందించడం అంటే మాటలు కాదు.. చేతలు కావాలి. ఆ చేతలు ద‌ర్శ‌కుఢీలో మెండుగా కనిపించాయి. కృష్ణ చైత‌న్య సినిమాను ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డంలో  స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. ముఖ్యంగా సెకండాఫ్ లో  ఒక్కో  ట్విస్ట్ ని రివీల్ చేస్తూ ఆడియ‌న్ ని  థ్రిల్ కి గురి చేసిన విధానం ప్ర‌శంసించాల్సిందే.  ఎక్క‌డా త‌డ‌బాటు లేకుండా  ప్ర‌తి స‌న్నివేశాన్ని ఇంట్ర‌స్టింగ్ గా, ఇన్నోవేటివ్ గా  తెర‌కెక్కించాడు డైర‌క్ట‌ర్ . న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ద‌గ్గ‌ర నుంచి మంచి వ‌ర్క్ రాబ‌ట్టుకున్నాడు. మ్యూజిక్, సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు బాగా హెల్ప‌య్యాయి. నిర్మాత‌లు రాజీపడకుండా క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా ఖ‌ర్చు పెట్టారు.

ఫైన‌ల్ గా చెప్పాలంటే…  ఇటీవ‌ల కాలంలో ఇన్ని ట్విస్టుల‌తో తెలుగులో ఏ సినిమా రాలేదు. సాధార‌ణంగా ఏ సినిమాలో అయినా …ఒక మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంది…దాన్ని ఎవ‌రు చేశారు? ఏంటి అన్న దానిపై సినిమా అంతా సాగుతుంది. కానీ ఈ సినిమాలో ఒక ట్విస్ట్ రివీల్ అయింద‌ని ఆడియ‌న్ రిలాక్స్ అయ్యే లోపే మ‌రో ట్విస్ట్ వ‌స్తుంది.  అది రివీల్ అయ్యేలోపు మ‌రో ట్విస్ట్ ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ఫ‌స్టాప్ లో కొంత ల్యాగ్ అయింద‌న్న ఫీలింగ్ తో పాటు అక్క‌డ‌క్క‌డ ఉన్న కొన్ని లొసుగులు అన్నీ  మ‌రిచిపోయేలా చేసాడు  ద‌ర్శ‌కుడు. పిల్ల‌లు, పెద్ద‌లు ప్ర‌తి ఒక్క‌రూ చూసే సినిమా `క‌థ వెనుక క‌థ‌` సో  డోంట్ మిస్ గో అండ్ వాచ్.

Related posts

Leave a Comment