లైంగిక వేధింపులే కాదు.. వర్ణ వివక్షను కూడా ఎదుర్కొన్నానంటోంది ఈ అమ్మాయి!?

aishwarya-Rajes
Spread the love

 ”నేను చూడడానికి  నల్లగా ఉన్నానని చాలా మంది ఎంతగానో అవహేళన చేశారు. `నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు` అని ఓ ప్రముఖ దర్శకుడు సైతం అన్నారు. ఓ కమెడియన్ పక్కన వేషం ఇస్తాను.. చేస్తావా` అని ఎంతగానో బుజ్జగించాడు. కెరీర్ ఆరంభంలో నేనూ  ఇలా చాలా వేధింపులకు గురయ్యాను. లైంగిక వేధింపులతోపాటు నేను వర్ణ వివక్షను కూడా ఎదుర్కొన్నా. అలాంటి ఎన్నో వేధింపులను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాను” అంటోంది  కథానాయిక ఐశ్వర్యా రాజేశ్‌  తెలుగులో ఒకప్పటి కథానాయకుడు, నటుడు రాజేశ్‌ కుమార్తె. హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు. ఎనిమిదేళ్ల వయసులో తండ్రిని కోల్పోవడంతో ఐశ్వర్యా రాజేశ్‌ కుటుంబం కష్టాలు పడింది. అక్కణ్ణుంచి కఠోర శ్రమ, కృషి, పట్టుదలతో దక్షిణాదిలో కథానాయికగా ఇవాళ ఓ స్థాయికి చేరుకున్నారు. ఐశ్వర్య తెలుగులో `కౌశల్యా కృష్ణమూర్తి`, `వరల్డ్ ఫేమస్ లవర్` వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల  ఓ సందర్భంలో తన నట జీవన ప్రయాణంలో ఎదురైన కష్టాలు, చేదు అనుభవాల గురించి ఐశ్వర్యా రాజేశ్‌ వివరించారు.. “ఉత్తరాది అమ్మాయిల తరహాలో ముస్తాబు కావడం, దుస్తులు వేసుకోవడం,ఎక్స్‌పోజింగ్‌ చేయడం నాకు రాదు. . అదీ ఓ సమస్యే.నేను తమిళం మాట్లాడానని కొంతమంది అవకాశాలు ఇవ్వకుండా తిరస్కరించారు. జీవితంలో లైంగిక వేధింపులు సహా అన్ని రకాల విమర్శలు, సమస్యలు ఎదుర్కొన్నాను. వేధించినవాళ్లకు, విమర్శకులకు సమాధానం చెప్పే సత్తా నాకు ఉంది. నేను బోల్డ్‌. మహిళలందరూ అలాగే ఉండాలని కోరుకుంటున్నా” అని ఐశ్వర్యా రాజేశ్‌ అన్నారు.

Related posts

Leave a Comment