పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో “అర్జున్ రెడ్డి” దర్శకుడి చిత్రం

MASSIVE! Producer Bhushan Kumar & director Sandeep Reddy Vanga announce next with Icon star, Allu Arjun!
Spread the love

అల్లు అర్జున్ ఈ పేరు కి ఇప్పుడు కొత్తగా పరిచయం అవసరం లేదు. పుష్ప ముందు వరకు తెలుగు ప్రేక్షకులలో వీపరీతమైన క్రేజ్ ఉన్న అల్లు అర్జున్, పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించాడు. తనదైన శైలితో పుష్ప రాజ్ ప్రపంచ వ్యాప్తంగా ఒక ఊపు ఊపాడు. బాక్సాఫిస్ వద్ద కలక్షన్స్ సునామి సృష్టించాడు. తాజాగా ఐకాన్ స్టార్, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో సినిమాను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ను, సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. దర్శకుడిగా మొదటి సినిమాతోనే తనదైన ముద్రను వేసి భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు సందీప్ రెడ్డి వంగ.
సందీప్ రెడ్డి వంగ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాను చేయనున్నట్లు నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను టీ సిరీస్ ప్రొడక్షన్స్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ మరియు ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించనున్నారు.
గతంలో అర్జున్ రెడ్డి సినిమా అల్లు అర్జున్ చేసుంటే ఇంపాక్ట్ గట్టిగ ఉంటుంది అని దర్శకుడు సందీప్ పలుసార్లు చెప్పుకొచ్చాడు.
ఈసారి అల్లు అర్జున్ తో సినిమా చేయనున్న సందీప్ ఐకాన్ స్టార్ ను ఏ రేంజ్ లో చూపించనున్నాడో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Related posts

Leave a Comment