ఆస్కార్ టీం “నాటు నాటు” సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ని అభినందించిన షేడ్ స్టూడియోస్ సీఈవో

Shade Studios CEO congratulated the Oscar team, Natu Natu singer, Rahul Sipliganj
Spread the love

రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ: నేను పాడిన పాట ఆస్కార్ కి నామినేట్ అవ్వడం నాకు ఎంతో గర్వకారణం గా ఉంది. ఈ విషయం తెలిసిన నా తల్లి తండ్రులు ఎంతోగానో ఆనందపడ్డారు. ఈ సంతోషానికి మూల కారణం, దర్శకధీరుడు రాజమౌళి గారు, ఎమ్.ఎమ్. కీరవాణి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నాటు నాటు సాంగ్ తప్పకుండ ఆస్కార్ లో గెలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఆప్యాయతలు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అదే విధంగా నేను షేడ్ స్టూడియోస్ లో ఎన్నో సినిమాలకి పాటలు పాడటం అవి హిట్ అవ్వడం జరిగాయి. ప్రత్యేకంగా, షేడ్ స్టూడియోస్ సీఈవో దేవిప్రసాద్ బలివాడ గారికి నా కృతజ్ఞతలు.

షేడ్ స్టూడియోస్ సీఈవో దేవీప్రసాద్ బలివాడ మాట్లాడుతూ: మొట్టమొదటి సారిగా తెలుగు ఖ్యాతిని గౌరవాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా లో “నాటు నాటు సాంగ్” ఆస్కార్ కి నామినేట్ అవ్వడం ఎంతో గర్వకారణం. ముఖ్యంగా, మా షేడ్ స్టూడియోస్ కి ఎంతో అనుబంధం ఉన్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ “నాటు నాటు“ సాంగ్ పాడటం మా టీం కి ఎంతో సంతోషాన్నించింది. మా షేడ్ స్టూడియో ఆధ్వర్యంలో
త్వరలో రానున్న #ఏపీ31 సినిమాకి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. గతంలో నాటు నాటు సాంగ్ కంపోజర్ ఏం.ఏం.కీరవాణి గారు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, సింగర్ కాల బైరవ మరియు లిరిక్ రైటర్ చంద్రబోస్ ప్రస్తుత ఆస్కార్ టీం తో కలిసి ఎన్నో సార్లు మ్యూజికల్ జర్నీ లో మా షేడ్ స్టూడియోస్ భాగమైనందుకు మేము అదృష్టం గా భావిస్తున్నాం.

ఈ సందర్భంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి మా షేడ్ స్టూడియోస్ తరుపున కంగ్రాట్యులేషన్స్ చెప్తూ, ఇక మీదట పాడే సాంగ్స్ దేశాన్ని గౌరవించే విధంగా ఉంటూ ప్రేక్షకులని ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను. నాతో పాటు ఈ సంతోషాన్ని పంచుకున్న మా షేడ్ స్టూడియోస్ టీమ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వాల్ క్రిష్ అండ్ ఇంజినీర్ రామ్ గండికోట కి నా కృతజ్ఞతలు.

Related posts

Leave a Comment