‘‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’’… రాబోతున్న ఈ వింటర్ కాలంలో ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి సినిమా లేదు అని బాధ పడేవారికి అహా వారు అందించబోతున్న సినిమా ఇది. గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి సూపర్ స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించబోతున్న సినిమా ఇది. ఈ సినిమా చూశాక, తెలుగు సినిమాను కూడా ఇంత సహజంగా తీస్తారా అనిపిస్తుంది. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు గొప్ప జర్నీని సినిమాలో చూపించిన విధానం అద్భుతమైనది. ఇలాంటి సినిమాని ఏ తల పండిన నిర్మాతనో తీయలేదు. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ ను నెలకొల్పి అలీ ఈ మంచి చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా కథ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. పైగా ఈ కథలో నరేష్ – పవిత్రా లోకేష్ జంటగా కనిపించబోతున్నారు. ఇద్దరి మధ్య మరోసారి అద్భుతమైన ఎమోషనల్ కెమిస్ట్రీని మీరు ఈ సినిమాలో చూడబోతున్నారు. అలాగే నరేష్ – పవిత్రా లోకేష్ పాత్రల జీవితాల్లో.. అలీ పాత్ర ఎలాంటి అలజడి సృష్టించిందనే కోణంలో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి.
ఇది సోషల్ మీడియా యుగం. ఈ కాలానికి తగ్గట్టు ఓ డిజిటల్ ఐడియాకు అనుగుణంగా అదిరిపోయే పాయింట్ తో అద్భుతమైన కంటెంట్ తో ఈ నెల 28 న ఈ సినిమా రాబోతుంది. మనవాళ్ళు అంతా తెలుగులో గొప్ప సినిమాలు రావు అంటారు గాని, నిజంగా ఇలాంటి గొప్ప సినిమా వచ్చినప్పుడు ఎందుకు చూడరు. మంచి సినిమా చూడాలనుకునే వారు ఆహా లో ఈ నెల 28న ఈ సినిమాని చూడండి. ప్రతి పాత్రకు ఒక కథ ఉంటుంది. అసలు ఇలాంటి కథలో అద్భుతమైన ఎమోషన్స్ అండ్ సస్పెన్స్ ను పెట్టడం అంటే మాటలా. అనుభూతితో కూడా ఓ విషాదపు ఫ్యామిలీ కథను (నరేష్ – పవిత్రా లోకేష్ పాత్రల కథ) థ్రిల్ చేస్తూ చెప్పడం.. పైగా అనేక భావోద్వేగాల సమ్మేళనంలా సాగిన ఈ సినిమా తెలుగు న్యాచురల్ సినిమాల్లో మరో సినిమాగా నిలిచిపోతుంది.
ఇక ఈ సినిమాలో చివరిదాకా ఏం జరుగుతుందో.. హీరో అలీ జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే పాయింట్ ను అండ్ ట్విస్ట్ ను దర్శకుడు చాలా ఇంట్రస్ట్ గా చెప్పాడు. క్లైమాక్స్ ముగిసే సరికి సినిమా పై ముఖ్యంగా అలీ నటన పై, నరేష్ – పవిత్రా లోకేష్ ల మధ్య కెమిస్ట్రీ పై గౌరవం పెరుగుతుంది. సోషల్ మీడియాకి సంబంధించిన కథతో ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఈ నెల 28న రాబోతున్న ఈ సినిమాని చూసి మంచి అనుభూతి పొందండి. ఈ సినిమాలో ఆలీ హీరోగా, నరేష్ – పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల దారులుగా నటిస్తుండగా మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం, లాస్య, ప్రణవి మానుకొండ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.