సినీనటుడు బాలయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు

hero balakrishna ku supreem noteesulu
hero balakrishna ku supreem noteesulu
Spread the love

హీరో నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కు సంబంధించి బాలయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన నటించిన ఈ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి పన్ను రాయితీ తీసుకొని కూడా టికెట్‌ రేట్లు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ పరిస్థితి ఎదురైంది. పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు బదలాయించలేదని సుప్రీంకోర్టు తమ నోటీసులో వెల్లడించింది. దీంతో పన్ను రాయితీ పొందిన డబ్బు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి రికవరీ చేయాల్సిందిగా పిటిషన్‌లో స్పష్టంగా విజ్ఞప్తి చేసింది. ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. వై.చంద్ర చూడ్ ధర్మాసనం.. వివరణ ఇవ్వాల్సిందిగా హీరో నందమూరి బాలకృష్ణ సహా ప్రతివాదులందరికీఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం!
.