బీట్స్ ఆఫ్‌ రాధే శ్యామ్.. గ్రేట్‌ రెస్పాన్స్

radhe shyam movie poster
Spread the love

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులకి పుట్టినరోజు సందర్భంగా స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చారు రాధేశ్యామ్ చిత్ర నిర్మాణ సంస్థ‌లు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్.. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కానుకగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ విక్ర‌మాదిత్యగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫ‌స్ట్ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తాజాగా రెబల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అనే మోష‌న్ పోస్టర్ విడుద‌ల చేశారు. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ప్రేమికులు దేవదాస్, పార్వతి.. లైలా మజ్ను ఫోటోల మీదుగా ఓ ట్రైన్ లో ఈ మోషన్ పోస్టర్ సాగుతుంది. చివరగా ప్రభాస్, పూజా హెగ్డే జోడి కనిపిస్తుంది. ఈ ప్రేమకథ కూడా అంత గొప్పగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. ప్ర‌తి సినిమాకి త‌న హ్యాండ్‌స‌మ్ లుక్స్, స్టైలిష్ మేకోవ‌ర్ తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసే రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. ఇప్పుడు రాధేశ్యామ్‌లో కూడా అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ మోషన్ పోస్టర్ తోనే సినిమా స్థాయి అర్థం అయిపోతుంది.

బాహుబలి1, బాహుబ‌లి2, సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న రెబ‌ల్‌ స్టార్ ప్ర‌భాస్ చిత్రాన్ని జిల్ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని రెబ‌ల్‌స్టార్ డాక్టర్ యువీ కృష్ణంరాజు స‌మ‌ర్పించ‌గా, వంశీ, ప్ర‌మోద్‌, ప్రసీదలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్నో సూప‌ర్‌హిట్స్ అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌‌పై నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్‌కి సంగీత‌ దర్శ‌కునిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం ఇట‌లీలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో రాధేశ్యామ్‌ను విడుద‌ల చేయడానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
చిత్ర స‌మ‌ర్ప‌కులు: రెబ‌ల్‌స్టార్ డాక్ట‌ర్ యువి కృష్ణంరాజు
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
ఎడిటర్: కోటగిరి వెంక‌టేశ్వ‌రావు
యాక్ష‌న్‌, స్టంట్స్‌: నిక్ ప‌వ‌ల్‌
మ్యూజిక్: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్
సౌండ్ డిజైన్: ర‌సూల్ పూకుట్టి
కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌
కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌: తోట విజ‌య భాస్క‌ర్ అండ్ ఎకా ల‌ఖాని
విఎఫ్‌ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌: క‌మ‌ల్ క‌న్న‌న్‌
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌ : ఎన్‌.సందీప్‌
హెయిర్‌స్టైల్‌‌: రోహ‌న్ జ‌గ్ట‌ప్‌
మేక‌ప్‌: త‌ర‌న్నుమ్ ఖాన్
స్టిల్స్‌: సుద‌ర్శ‌న్ బాలాజి
ప‌బ్లిసిటి డిజైన‌ర్‌: క‌బిలాన్‌
పిఆర్ఓ: ఏలూరు శ్రీను
కాస్టింగ్ డైరెక్ట‌ర్‌: ఆడోర్ ముఖ‌ర్జి
ప్రొడక్షన్ డిజైనర్: ర‌‌వీంద‌ర్‌
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్రసీద
దర్శకుడు: రాధాకృష్ణ కుమార్

Related posts

Leave a Comment