జైద్ ఖాన్, సోనాల్ మోన్‌టైరో హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘బనారస్’ . త్వరలోనే ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. జయతీర్థ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తిలక్‌రాజ్ బల్లాల్ నిర్మాత. అజనీష్ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా నుంచి ‘మాయ గంగ’ పాటను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో..
స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ‘‘నిర్మాత తిలక్‌గారి మనసు చాలా మంచి మనసు. ఫ్రెండ్ కోసం.. జైద్ ఖాన్ కోసం మీరు ఓ సినిమా చేయడం గొప్ప విషయం. మంచి ప్రయత్నం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. మాయ గంగ పాట బ్యూటీ ఫుల్ మెలోడి. కె.కె. బ్యూటీఫుల్‌గా పాటను రాశాడు. జయతీర్థ డైరెక్ట్ చేసిన బెల్ బాటమ్ గురించి నేను చాలా విన్నాను. ఆహాలో తప్పకుండా చూస్తాను. అన్నం ఉడకిందా లేదా అని చూడటానికి ఒక మెతుకు పట్టకుంటే చాలన్నట్లు బెనారస్ మూవీ గురించి ఈ మాయ గంగ సాంగ్ చెప్పేస్తుంది. చాలా చాలా బావుంది. ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు. జైద్గారి నాన్నగారు కన్నడలో చాలా పెద్ద పొలిటీషియన్. కానీ సినిమాలపై ఆసక్తితో జైద్ సినిమాల్లోకి వచ్చాడు. తనకు సినిమాలంటే చాలా ప్యాషన్. చాలా బాగా చేశాడని పాట చూస్తేనే అర్థమవుతుంది. తనకు విష్ యు ఆల్ ది బెస్ట్. పాన్ ఇండియా లెవల్లో సినిమా పెద్ద హిట్ కావాలని కోరకుంటున్నాను. ఎంటైర్ టీమ్‌కు అభినందనలు’’ అన్నారు.
నిర్మాత తిలరాజ్ బల్లాల్ మాట్లాడుతూ ‘‘మా పాటను రిలీజ్ చేయడానికి సుకుమార్‌గారు రావటం మాకు గర్వంగా ఉంది. ఇక ‘బనారస్’ సినిమా గురించి చెప్పాలంటే ముందు హీరో జైద్ ఖాన్ గురించి చెప్పాలి. తనకు సినిమాలంటే ఎంతో ప్యాషన్. అది నేను గమనించాను. బిజినెస్ చేసుకోమని తండ్రి చెబుతున్నా.. సినిమా రంగంలోకి ఆసక్తిగా వచ్చాడు. తనని నేను ముంబైకి తీసుకొచ్చాను. తను డేడికేషన్, హార్డ్ వర్క్‌తో అన్నివిషయాలను తెలుసుకుని సినిమా చేశాడు. పాజిటివ్ వైబ్స్‌తో చేసిన ఈ సినిమాకు అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. పుష్ప సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మా సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.
చిత్ర దర్శకుడు జయతీర్థ మాట్లాడుతూ ‘‘నేను చిన్నప్పుడే స్కూల్ మానేశాను. అయితే వీధి నాటకాలు చేస్తూ పెరిగాను. నేను డైరక్ట్ చేసిన బెల్ బాటమ్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను థియేటర్స్‌లో పలకరించబోతున్నాను. సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమో నాకు తెలుసు. సినిమాను వారిలా మరెవరూ ప్రేమించలేరు. భాష ఏదైనా మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకుల్లా ఎవరూ ఆదరించలేరు. మా సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
హీరో జైద్ ఖాన్ మాట్లాడుతూ ‘‘మా పాటను విడుదల చేసిన సుకుమార్‌గారికి థాంక్స్. తెలుగు సినిమాలకు నేను పెద్ద అభిమానిని. హీరోగా నేను వేస్తున్న తొలి అడుగు ఇది. ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
హీరోయిన్ సోనాల్ మోన్‌టైరో మాట్లాడుతూ ‘‘నాకే కాదు.. మా అందరి హృదయాలకు ఎంతో దగ్గరైన సినిమా ఇది. కన్నడ, మలయాళంలో ఇప్పటికే విడుదలైన మాయ గంగ అనే పాట సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో రిలీజ్ అవుతుండటం ఎంతో ఎగ్జయింట్మెంట్నిచ్చింది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. సినిమా కూడా అందరికీ నచ్చతుంది’’ అన్నారు.
లిరిక్ రైటర్ కె.కె. మాట్లాడుతూ ‘‘సుకుమార్‌గారు మా పాటను రిలీజ్చేయడం మాకెంతో హ్యపీగా అనిపించింది. మాటల రచయిత హనుమాన్ చౌదరి ‘బనారస్’ మూవీ గురించి చెప్పినప్పుడు ట్యూన్ విన్నాను, ఎంతో బాగా నచ్చింది. డబ్బింగ్ పాటలు రాయటం చాలా కష్టం. అందులోనూ లిప్ లేదు. దాంతో కాస్త కష్టమైనా చక్కగా కుదిరింది. జయతీర్థ గారికి ఇది ఏడో సినిమా. కొత్త హీరో హీరోయిన్లను, జయతీర్థగారిని అండ్ టీమ్‌కు అభినందనలు’’ అన్నారు.