మరోసారి ఐటెం సాంగ్ కు సమంత రెడీ!

Samantha Item Song
Spread the love

అల్లు అర్జున్ ‘పుష్ప:ది రైజ్‌’లో ఊ.. అంటావా (తమిళంలో ఊ సోల్రియా) ఐటెం సాంగ్ కోసం సమంత సెక్సీగా మారినప్పుడు స్క్రీన్‌లపై మెరుపులు మెరిశాయి. కొంతమంది నిప్పులు చెరిగారు. అవేమీ ఆమె పట్టించుకోలేదు సరికదా.. ఇప్పుడు మరోసారి ఐటెం సాంగ్ కు రెడీ అయింది. సమంత చేసిన ‘ఊ అంటావా..’ సాంగ్ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. విషయాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాలో డ్యాన్స్ చేయడానికి సమంత చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాట కోసం సమంతను గాడిన పెట్టాలని దర్శకుడు పూరీ జగన్నాథ్ భావిస్తున్నారట. ఈ విషయం ఇప్పటికీ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. ‘పుష్ప: ది రైజ్‌’లో చేసిన ‘ఊ అంటావా..’ ఘనవిజయం తర్వాత సమంతకు సినిమాల్లో ఐటెం సాంగ్ లను కూడా విరివిరిగా చేయాలనే డిమాండ్ వస్తుందట. అందుకు సమంత కూడా సై అంటోందిట. దర్శకుడు పూరీ జగన్నాధ్, సహ నిర్మాత ఛార్మి కౌర్‌తో సహా ‘లైగర్’ బృందం ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాట కోసం సమంతను ఎంపిక చేయాలనుకున్నారు. అయితే.. సమంత అందుకు ఒప్పుకుంటుందా? లేదా? అన్నది తెలియదు చూడాలి మరి!!.

Related posts

Leave a Comment