50 వసంతాల ‘మోసగాళ్లకు మోసగాడు’

50 years off 'mosagallaku mosagaadu' telugu movie hero krishna
50 years off 'mosagallaku mosagaadu' telugu movie hero krishna
Spread the love
  • : పద్మాలయా సంస్థకు యాభై ఏళ్లు నిండాయి
  • పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకం గా నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆగస్ట్ 27-1971న విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా స్టామినా అంతర్జాతీయ స్థాయిలో మోత మోగించింది. పాన్ ఇండియా సినిమా అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీయలేరు. కానీ ఆ రోజుల్లోనే సూపర్ స్టార్ కృష్ణ పాన్ ఇండియా సినిమా తీసి చూపించారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ 56 దేశాలలో ప్రదర్శింపబడి ప్రకంపనలు సృష్టించింది. తమిళ్ లో ‘మోసక్కారన్ కు మోసక్కారన్’ ఇంగ్లీష్ లో ‘ట్రెజర్ హంట్’ పేరుతో డబ్బింగ్ చేయబడినది. రిపీట్ రన్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రదర్శింపబడేది అని ఇటీవల హీరో కృష్ణ పలు సందర్భాలలో చెప్పేవారు. వి. ఎస్.ఆర్ స్వామి ఫోటోగ్రఫీ, మాధవరావు మేకప్ పనితనం, ఆదినారాయణ రావు సంగీతంలో సూపర్ హిట్ పాటలు.. నేపధ్య సంగీతం ప్రేక్షకులను అభిమానులకు నూతన అనుభూతిని అందించాయి. హీరోయిన్ విజయనిర్మలతో కృష్ణ ‘కొరినది నెరవేరింది..’ పాట చిత్రీకరణ కోసం డార్జిలింగ్ వెళ్లి చిత్రికరించడం విశేషం. ఈ ఆగస్ట్ 27-1971 రోజుతో పద్మాలయా సంస్థ కూడా 50 వసంతాలు పూర్తి చేసుకోవడం విశేషం .కృష్ణ సాహసోపేత నిర్ణయాలకు వారి సోదరులు హనుమంతరావు అదిశేషగిరి రావు సహకారం తో విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. అమితాబచ్చన్ – రజనీకాంత్ లాంటి అగ్రనటులతో సినిమాలు నిర్మించిన ఏకైక సంస్థ పద్మాలయా. వరుసగా ‘పాతాళ భైరవి’, ‘మవ్వాలి’, ‘హిమ్మత్ వాలా’ 3 సిల్వర్ జూబ్లీలు నిర్మిచిన ఏకైక దక్షిణ భారత నిర్మాణ సంస్థ పద్మాలయా. దర్శకులు కె.రాఘవేంద్రరావు, ఈ వి వి సత్యనారాయణ హీరోయిన్స్ శ్రీదేవి సౌందర్యలను హిందీ చిత్ర సీమకు పరిచయం చేసిన సంస్థ.50 వసంతాలు పూర్తి అయిన సందర్భముగా కృష్ణ, వారి సోదరులు అది శేషగిరిరావు గారు మాట్లాడుతూ పద్మాలయా సంస్థ మళ్ళీ సినిమా నిర్మాణము చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. హనుమంతరావు గారి కుమారులు ప్రసాద్ బాబు నరసయ్య బాబు అదిశేషగిరి రావు గారి కుమారుడు రాఘవ రత్న బాబు సారథ్యం లో సంస్థ ప్రణాళికలు సిద్ధం అవుతున్నట్లు తెలియవచ్చిది