భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ అక్టోబర్ 5 న గ్రాండ్ విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది.మేకర్స్ ఇప్పుడు గాడ్ ఫాదర్ మెగా పబ్లిక్ ఈవెంట్ తేదీ, వేదికను ప్రకటించారు. సెప్టెంబరు 28న అనంతపురం లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు గాడ్ ఫాదర్ టీమ్ ఈ మెగా వేడుకకు హాజరుకానున్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్న అభిమానులు, సినీ ప్రేక్షకుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్ గా జరగనుంది. ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని ముఖ్య తారాగణం. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.
Related posts
-
W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్.
Spread the love గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర... -
Hero Allari Naresh Congratulates the Team of W/O Anirvesh
Spread the love Under the banner of Gajendra Productions by Venkateswarlu Merugu, Sri Shyam Gajendra, presented by... -
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ...