అక్కినేని అఖిల్ ఎంట్రీ ఇచ్చి 11 ఏళ్లవుతున్నా.. ఫ్యాన్స్ ఆశించిన ఆ ‘బిగ్ బ్రేక్’ మాత్రం ఇంకా రాలేదు. ప్రతిసారీ ఏదో మిస్సవుతూనే ఉంది. అయితే, ఈసారి తన రొటీన్ చాక్లెట్ బాయ్ ఇమేజ్‌ను పక్కనపెట్టి, పూర్తి మాస్, రస్టిక్ అవతారంలో ‘లెనిన్’ అంటూ థియేటర్లలోకి దిగాడు. మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ విలేజ్ డ్రామా.. అఖిల్ కెరీర్‌కు ఎలాంటి టర్నింగ్ పాయింట్ ఇచ్చిందో ఈ రివ్యూలో చూద్దాం! మూవీ హైలైట్స్: నటీనటులు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, ప్రమోద్ పంజు, బ్రహ్మాజీ, ఈశ్వరీ బాయి తదితరులు. కథ, దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరి నిర్మాణ సంస్థలు: మనం ఎంటర్‌టైన్‌మెంట్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మ్యూజిక్: ఎస్.ఎస్. థమన్ సింపుల్‌గా కథ ఏంటంటే.. ఇదొక రివెంజ్ డ్రామా. 2001లో కడప జైలు నుంచి బయటకు వచ్చిన లెనిన్…
