సన్ నెక్స్ట్ ఓటీటీ వేదికగా ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’

Sun Next to launch 'The Love Story Told by the Clouds' on OTT platform

యూత్ కి నచ్చేలా ప్రేమ, సంగీత ప్రియులని కట్టిపడేసే మ్యూజిక్, అద్భుతమైన లొకేషన్స్‌తో తెరకెక్కిన మేఘాలు చెప్పిన ప్రేమకథ చిత్రం థియేటర్ లో అలరించి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. చూస్తున్నంత సేపు అద్భుతమై అనుభూతిని పంచే ఈ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం సన్ నెక్స్ట్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఒక మధురమైన ప్రేమకథను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా, దర్శకుడు విపిన్ ఈ ప్రేమకథకు సరికొత్త శైలీలో తీర్చిదిద్ది విజయం సాధించారు. యూత్ ను కట్టిపడేసే ఈ రోమాంటిక్ ఎంటర్ టైనర్ కథ విషయానికి వస్తే.. వరుణ్‌ (నరేష్ అగస్త్య) ఒక ధనవంతుడి కొడుకు కానీ సొంతంగా ఏదో సాధించాలని, తన కళను నిరుపించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. తన తండ్రి ఇష్టాలకు, ఆశయాలకు వ్యతిరేకంగా నడుచుకుంటాడు. ఇలా సాగుతుండగా.. వరణ్ కు మేఘన తో (రాబియా…