Three powerhouses of India – Producer Bhushan Kumar, Director Sandeep Reddy Vanga and Icon star Allu Arjun come together for a massive collaboration. The movie under this association will be produced by T-Series Films Production and Bhadrakali Pictures. Producer Bhushan Kumar, Pranay Reddy Vanga, Co-Producer Shiv Chanana along with director Sandeep Reddy Vanga and the superstar Allu Arjun recently met to formalize this huge collaboration. Headlined by Allu Arjun, the filming of this movie will commence right after the wrap up of Sandeep Vanga’s Spirit which is also produced by…
Year: 2023
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో “అర్జున్ రెడ్డి” దర్శకుడి చిత్రం
అల్లు అర్జున్ ఈ పేరు కి ఇప్పుడు కొత్తగా పరిచయం అవసరం లేదు. పుష్ప ముందు వరకు తెలుగు ప్రేక్షకులలో వీపరీతమైన క్రేజ్ ఉన్న అల్లు అర్జున్, పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించాడు. తనదైన శైలితో పుష్ప రాజ్ ప్రపంచ వ్యాప్తంగా ఒక ఊపు ఊపాడు. బాక్సాఫిస్ వద్ద కలక్షన్స్ సునామి సృష్టించాడు. తాజాగా ఐకాన్ స్టార్, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో సినిమాను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ను, సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. దర్శకుడిగా మొదటి సినిమాతోనే తనదైన ముద్రను వేసి భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాను చేయనున్నట్లు…
Grandhalayam Telugu Movie Review : కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గ్రంథాలయం’
(రేటింగ్ : 3/5, నటీనటులు: విన్నుమద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలకేయప్రభాకర్, సోనియాచౌదరి, అలోక్‌జైన్, జ్యోతిరానా, కాశీశినాథ్, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త తదితరులు సాంకేతిక నిపుణులు : బ్యానర్ ::వైష్ణవి శ్రీ క్రియేషన్స్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ః) : అల్లంనేని అయ్యప్ప, రచన దర్శకత్వం : శివన్ జంపాన, సినిమాటోగ్రఫీ : సామలభాస్కర్, సంగీతం : వర్ధన్, ఎడిటర్ : శేఖర్‌పసుపులేటి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ఃల్ : చిన్నా, ఆర్ట్‌డైరెక్టర్ : రవికుమార్ మండ్రు, పి. ఆర్. ఓ : దీరజ్, ప్రసాద్) కంటెంట్ వున్న సినిమాల్ని ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారు.. అది చిన్న సినిమానా.? పెద్ద సినిమానా.? అన్న తేడాలుండవ్ ప్రేక్షకులకి. సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఒక సస్పెన్స్ కాన్సెప్టు ను కమర్షియల్ గా ఫస్ట్ టైం…
Saachi movie review : ఆలోచింపజేసే ‘సాచి’ !!
విధాత ప్రొడక్షన్స్ పై ఫిల్మ్ స్టార్స్ మేకర్ సత్యానంద్ గారి సమర్పణ లో రొటీన్ చిత్రాలకు భిన్నంగా బిందు అనే ఒక నాయి బ్రమ్మిన్ అమ్మాయి నిజ జీవిత గాధను ఆధారంగా చేసుకుని ఒక మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంలా కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి చక్కగా తెరకెక్కించిన చిత్రం “సాచి”. ఈ చిత్రాన్ని ఉపేన్ నడిపల్లి మరియు వివేక్ పోతగోని నిర్మాణ సారధ్యములో వివేక్ పోతగోని దర్శకుడిగా రూపొందించారు. ఈ సినిమా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ: ఆడ మగ అనే తేడా లేకుండా మన కళ్ళ మీద మనం నిలబడాలి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుంది. కుల వృత్తికి మించిన పని లేదు అనే సిద్ధాంతం ఈ సినిమాలో పొందుపరచడం జరిగింది.…
Balagam Telugu Movie Review: తెలంగాణ పల్లె జీవిత కథ!
తెలంగాణ పల్లెల్లో వున్న సంప్రదాయం, కట్టుబాట్లు, కుటుంబం, బంధాలు, అనుబంధాలు, ఆచారాల గురించి చెప్పే కథలతో వస్తున్న సినిమాలకు టాలీవుడ్ లో మంచి ఆదరణ లభిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా ప్రేక్షకుల ముందుకొస్తున్న భావోద్వేగమయిన కథలు సహజంగానే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కుటుంబం కానీ, గ్రామం కానీ, లేదా ఎక్కడ అయినా, అందరూ కలిసి ఉంటే అదే ఒక ‘బలగం’ అవుతుంది అనే చెప్పే కథతో వచ్చిన తాజా చిత్రమిది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన ఈ ‘బలగం’ చిత్రంతో ‘జబర్దస్త్’ టీవీ షోతో బాగా పాపులారిటీ సాధించిన నటుడు వేణు ఎల్దండి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ఇందులో ముఖ్యమైన పాత్రలు పోషించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక గ్రామం లో ఈ సినిమా…
సాయిధరమ్ తేజ్.. ఆసక్తిని పెంచుతోన్న ‘విరూపాక్ష’ టీజర్
‘చరిత్రలో ఇలాంటి సంఘటన జరగటం ఇదే మొదటిసారి’ అని సాయిచంద్ ఓ విషయాన్ని గురించి ప్రస్తావించాడు. అదే సమయంలో ఓ జీపు అడవి మార్గం గుండా ప్రయాణించి ఓ భవంతి ముందు ఆగుతుంది. అదే సమయంలో దీనికి పరిష్కారం ఉందా? లేదా? అని ఓ వ్యక్తి సాయి చంద్‌ని ప్రశ్నించగా దీని నుంచి బయట పడటానికి మనకు ఒకే ఒక మార్గం ఉందని సాయిచంద్ మార్గాని చెబుతాడు. వెంటనే ఆ వ్యక్తి అసలేం జరుగుతుందిక్కడ అని అడుగుతాడు. వెంటనే సాయిధరమ్ తేజ్ పాత్రను మనకు చూపిస్తారు. అసలు సాయిధరమ్ తేజ్‌కి..సాయిచంద్ చెబుతున్న సమస్యకు పరిష్కారం ఏంటనేది తెలుసుకోవాలంటే ‘విరూపాక్ష’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు…
టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ 170వ చిత్రం
సూపర్‌స్టార్ రజినీకాంత్ 170వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జై భీమ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాత సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా తలైవర్ 170వ సినిమా అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ మేరకు వారు ‘‘ఈరోజు మా చైర్మన్ సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారి తలైవర్ 170వ సినిమాను మా బ్యానర్‌లో రూపొందించబోతున్నట్లు ప్రకటించటం ఆనందంగా ఉంది. టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. రాక్‌స్టార్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనున్నారు. జి.కె.ఎం. తమిళ్ కుమరన్‌గారి నేతృత్వంలో త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తాం. అలాగే 2024లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ‘‘తలైవర్‌గారితో లైకా ప్రొడక్షన్స్ సంస్థకు ఉన్న…
‘కస్టడీ’ చిత్రం నుంచి అరవింద్ స్వామి పోషిస్తున్న రాజు క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన చిన్న గ్లింప్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కృతి శెట్టి పాత్ర పోస్టర్ కూడా క్యురియాసిటీని పెంచింది. ఈ రోజు మేకర్స్ ట్యాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి పాత్ర పోస్టర్‌ను విడుదల చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో రాజు అలియాస్ రాజు (Raju aka Raazu) పాత్ర పోషిస్తున్నారు. అతని లుక్ చాలా పవర్ ఫుల్ గా వుంది. సంకెళ్లతో బార్స్ వెనుక కనిపిస్తున్నారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో బలమైన పాత్ర పోషిస్తున్నారని ఈ పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది. ఈ ఫెరోసియష్ లుక్ ఈ…
Arvind Swami’s Powerful Character Poster As Raju aka Raazu From Custody Unveiled
Young hero Akkineni Naga Chaitanya’s Telugu-Tamil bilingual project Custody directed by leading filmmaker Venkat Prabhu recently wrapped up its shoot. And the team is currently busy with post-production work. The recently released short glimpse impressed everyone and the character poster of Krithi Shetty also raised curiosity. Today, makers delighted everyone by unveiling the character poster of enigmatic and talented actor Arvind Swami. He is playing the role of Raju aka Raazu in the film. His look is so powerful and the actor is seen with handcuffs and behind the bars.…
మే 5న విడుదలకి సిద్ధమవుతోన్న ‘# మెన్ టూ’
నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 5న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా… చిత్ర దర్శకుడు శ్రీకాంత్ జి.రెడ్డి మాట్లాడుతూ ‘‘హ్యాష్ ట్యాగ్ మెన్స్ టూ సినిమాతో ఎవరినో బాధ పెట్టాలనే ఉద్దేశం లేదు. ఓ విషయాన్ని ఓ కోణంలోనే కాకుండా మరో కోణంలో కూడా చూడాలని చెబుతూ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ‘#మెన్ టూ’ను రూపొందిస్తున్నాం. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. మే 5న గ్రాండ్‌గా సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నిర్మాత మౌర్య సిద్ధవరం మాట్లాడుతూ…
