పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద విజ్ఞానాన్ని ఉపదేశించే శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి వారికి పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం ముదావహం. సమతామూర్తి విగ్రహ స్థాపన ద్వారా చినజీయర్ స్వామి నవతరానికి చక్కటి సందేశాన్ని ఇవ్వడమే కాకుండా ‘జిమ్స్’ సంస్థ ద్వారా విద్య, వైద్య సేవలు అందిస్తున్నారు. రామచంద్ర మిషన్ ద్వారా అందిస్తున్న సేవలను గుర్తిస్తూ అధ్యాత్మిక గురువు శ్రీ కమలేశ్ డి.పటేల్ గారిని పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషదాయకం. ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎం.ఎం.కీరవాణి గారిని పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం ఆనందదాయకం. ఆర్.ఆర్.ఆర్. చిత్రం ద్వారా తెలుగు సినిమా పాటకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు. సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న సంఘ సేవకులు డా.సంకురాత్రి…
Month: January 2023
”వాలెంటైన్స్ నైట్” ఖచ్చితంగా అందరికీ నచ్చే సినిమా: ప్రెస్ మీట్ లో ”వాలెంటైన్స్ నైట్” టీమ్
సునీల్, చైతన్య రావు మదాడి ప్రధాన పాత్రలలో స్వాన్ మూవీస్ సమర్పణలో ఫన్ సాగ బ్యానర్ పై అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ”వాలెంటైన్స్ నైట్’. తృప్తి పాటిల్, సుధీర్ యాళంగి మహీంధర్ (MO) నారల నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. జనవరి 26న ఈ చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్ మీట్ లో చైతన్య రావు మాట్లాడుతూ.. నిర్మాతలు సుధీర్, మహీంధర్ గారు ఈ కథని బలంగా నమ్మి ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. దర్శకుడు అనిల్ సినిమాని చాలా కొత్తగా తెరకెక్కించారు. ఇందులో చాలా జోనర్స్ వున్నాయి. ఒకే సినిమాలో దాదాపు పది కథలు చూడొచ్చు. ఒక కథకి మరో కథకి ఎక్స్ లెంట్…
‘కాలా బార్ బేరియన్ చాప్టర్ 1’ చిత్రం పోస్టర్, ట్రైలర్ విడుదల
బాలీవుడ్ తెరపై కొత్త విలనిజం ప్రజ్ఞన్ ప్రస్తుతం తెలుగు సినిమా బాలీవుడ్ లో బావుటా ఎగుర వేస్తున్న తరుణంలో కరీంనగర్ కుర్రాడు బాలీవుడ్ చిత్రంలో విలన్ గా నటించాడు. వివరాల్లోకెళితే పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పొందిన కొంతమంది విద్యార్థులు కలిసి ఫ్రెండ్స్ అండ్ ఫిలిమ్స్ పతాకం పై హిందీ, తెలుగులో ‘కాలా బార్ బేరియన్ చాప్టర్ 1’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో మంచి ఫర్ ఫార్మెన్స్ వున్న పాత్రలో కరీంనగర్ కు చెందిన ప్రజ్ఞన్ నటించారు. చిన్నప్పటి నుంచి సినిమాల మీదున్న మక్కువతో ప్రజ్ఞన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నాలుగైదు చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత పూణేలో మల్టీ మీడియాలో నైపుణ్యం సాధిస్తూ, మరో వైపు పూణే ఫిల్మ్ ఇన్టిస్టిట్యూట్ లో ప్రత్యేక శిక్షణ పొంది, ప్రస్తుతం ‘ కాలా…
‘రైటర్ పద్మభూషణ్’ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్
ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. మీ నేపధ్యం గురించి చెప్పండి ? మాది విజయవాడ. అక్కడే బిటెక్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చాను. బిటెక్ లో ఉన్నప్పుడే సినిమాలపై ఆసక్తి వుండేది. హైదరాబాద్ వచ్చాక ప్రయత్నాలు మొదలుపెట్టాను. అయితే…
మార్చి 17న ఉపేంద్ర ‘కబ్జా’ వస్తోంది!
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘కబ్జా’. శాండిల్‌వుడ్ నుంచి ఈ ఏడాది రిలీజ్ అవుతున్న ఈ చిత్రం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రారంభం నుంచి ప్రమోషనల్ యాక్టివిటీస్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూ వచ్చింది. అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్.చంద్రు డైరెక్ట్ చేస్తున్నారు. ఉపేంద్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ‘కబ్జా’ టీజర్‌తో ఈ పీరియాడిక్ ఫిల్మ్‌పై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి. ఇండియాలో ఓ గ్యాంగ్‌స్టర్ క్రమ క్రమంగా ఎలా ఎదిగాడనేదే ‘కబ్జా’ చిత్రం. 1947 నుంచి 1984 కాలంలో నడిచే కథ. స్వాతంత్య్ర సమర యోధుడు కొడుకు మాఫియా వరల్డ్‌లో ఎలా చిక్కుకున్నాడు. తర్వాత ఏ రేంజ్‌కు చేరుకున్నాడనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. చంద్రు దర్శకత్వంలో…
పోస్ట్ ప్రొడక్షన్ దశలో ‘అగ్ని నక్షత్రం’
లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ – మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైమ్ డా. మోహన్ బాబు, ఎవర్ ఛార్మింగ్ మంచు లక్ష్మీప్రసన్న కలిసి తెర పంచుకుంటున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. మలయాళంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన మలయాళ నటుడు సిద్దిక్, ప్రముఖ యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్ల తో పాటు భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. వంశీ కృష్ణ మళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అచ్చు రాజామణి సంగీతం అందిస్తున్నారు. గోకుల్ భారతి కెమెరామెన్ గా, మధు రెడ్డి ఎడిటర్…
‘హంట్’ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది – సుధీర్ బాబు ఇంటర్వ్యూ
నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు మీడియాతో ముచ్చటించారు. సినిమాలో మెమరీ లాస్ అయిన పోలీస్ అధికారిగా నటించారు. యాక్షన్ కొత్తగా ట్రై చేశారు. ‘జాన్ విక్ 4’కు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్లతో పని చేశారు. ఆ విశేషాలను ఇంటర్వ్యూలతో పంచుకున్నారు. హాయ్ అండీ! ఎవరిని ‘హంట్’ చేయబోతున్నారు? సుధీర్ బాబు : అది మీరు సినిమాలో చూడాలి. ఎవరిని ‘హంట్’ చేస్తున్నానని సస్పెన్స్ సినిమా అంతా ఉంటుంది. ప్రతి పాత్రను అనుమానిస్తూ ఉంటాను. ప్రేక్షకులు కూడా నా పాత్రతో పాటు ప్రయాణిస్తూ కొత్త కొత్త…
జనవరి 30న నాని ‘దసరా’ టీజర్ విడుదల
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. నాని కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రమిది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కాగ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్ మెంట్ తో వచ్చారు. జనవరి 30న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌కి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇది. అనౌన్స్ మెంట్ వీడియోలో మధ్య వయస్కుడైన గ్రామస్థుడు బీడీ వెలిగించి, అగ్గిపుల్లని విసిరినప్పుడు మంటలు చెలరేగుతాయి. ఆ మంటల్లో టీజర్ తేదీని రివిల్ చేయడం చాలా ఆసక్తికరంగా వుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.…
Natural Star Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, SLV Cinemas’ Dasara Teaser On January 30th
Natural Star Nani’s most-awaited mass action entertainer Dasara which marks the maiden Pan India film for the actor is getting ready for a grand release worldwide on March 30th. Directed by debutant Srikanth Odela, the movie’s production works were already competed and post-production works are also happening at a brisk pace. The makers came up with a big announcement. This is regarding the teaser of the movie which will be unleashed on January 30th. The announcement video shows a middle-aged villager lighting a beedi. When he throws the match stick,…
‘శాకుంతలం’ నుంచి దుష్యంతుడు, శకుంతల మధ్య ప్రేమను తెలియజేసే రొమాంటిక్ సాంగ్ ‘ఋషి వనంలోన…’
స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’. ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా తెరకెక్కించే గుణ శేఖర్ మరోసారి ‘శాకుంతలం’ వంటి విజువల్ వండర్‌తో పాన్ ఇండియా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయటానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అందులో భాగంగా విడుదలైన మూవీ ట్రైలర్, ‘మల్లికా మల్లికా..’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో బుధవారం చిత్ర యూనిట్ ‘శాకుంతలం’ సినిమా నుంచి ‘ఋషి వనంలోన…’ పాటను విడుదల చేశారు. మెలోడి బ్రహ్మగా పేరున్న మణిశర్మ…