– ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయాలి.. – కళ్యాణ్ రామ్ డెడికేషన్ చూసి ఫిదా అయ్యా.. టాలీవుడ్, శాండిల్‌వుడ్‌కి వర్క్ ఎన్విరాన్‌మెంట్ పరంగా పెద్దగా తేడా లేదు. భాష మాత్రమే వ్యత్యాసం. అయితే తెలుగులో మాత్రం ప్రమోషన్స్ చాలా బాగా చేస్తారు. మంచి ప్లానింగ్‌తో ముందు కెళతారు’’ అని అంటున్నారు హీరోయిన్ ఆషికా రంగనాథ్. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ తెలుగులో నటిస్తోన్న తొలి చిత్రం ‘అమిగోస్’. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఆషికా రంగనాథ్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. అమిగోస్ సినిమా జర్నీ ఎలా మొదలైందనే విషయంతో…
Month: January 2023
One of the Biggest Sportainment events in the country, the Celebrity Cricket League (CCL) is coming back fully reloaded after 3 years
The reloaded edition is expected to be even bigger this time with the participation of many incredibly popular stars of Indian cinema. Tel: The Celebrity Cricket League (CCL) brings together the country’s eight major film industries – Hindi, Tamil, Kannada, Telugu, Malayalam, Bhojpuri, Bengali, and Punjabi onto the cricket field. Parle Biscuits has signed up as the Title Sponsor of the League. The league is star-studded with Salman Khan as the Brand Ambassador of the Mumbai Team, Mohan Lal as the mentor for the Kerala Team, Venkatesh as the mentor…
ఆస్కార్ టీం “నాటు నాటు” సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ని అభినందించిన షేడ్ స్టూడియోస్ సీఈవో
రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ: నేను పాడిన పాట ఆస్కార్ కి నామినేట్ అవ్వడం నాకు ఎంతో గర్వకారణం గా ఉంది. ఈ విషయం తెలిసిన నా తల్లి తండ్రులు ఎంతోగానో ఆనందపడ్డారు. ఈ సంతోషానికి మూల కారణం, దర్శకధీరుడు రాజమౌళి గారు, ఎమ్.ఎమ్. కీరవాణి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నాటు నాటు సాంగ్ తప్పకుండ ఆస్కార్ లో గెలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఆప్యాయతలు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అదే విధంగా నేను షేడ్ స్టూడియోస్ లో ఎన్నో సినిమాలకి పాటలు పాడటం అవి హిట్ అవ్వడం జరిగాయి. ప్రత్యేకంగా, షేడ్ స్టూడియోస్ సీఈవో దేవిప్రసాద్ బలివాడ గారికి నా కృతజ్ఞతలు. షేడ్ స్టూడియోస్ సీఈవో దేవీప్రసాద్ బలివాడ మాట్లాడుతూ: మొట్టమొదటి సారిగా తెలుగు ఖ్యాతిని గౌరవాన్ని…
Shade Studios CEO congratulated the Oscar team, Natu Natu singer, Rahul Sipliganj
Shade Studios CEO Deviprasad Balivada said: SS Rajamouli is the first director who has introduced Telugu cinema to the World . It is a matter of pride to be nominated for an Oscar for RRR movie “Natu Natu Song” directed by him. Especially, singer Rahul Sipliganj, who is very associated with our Shade Studios, sang the song “Natu Natu” which made our team very happy. Under the guidance of our Shade studio Singer Rahul Sipliganj has sung for the upcoming movie #AP31. We feel fortunate that our shade studios have…
‘యమునా నది’ ట్రైలర్ విడుదల
సాయి లక్ష్మిగణపతి మూవీ క్రియేషన్స్ పతాకంపై రోషన్ బాల్ భోగట్టి, ఊర్విజ జంటగా యన్. కె. సాయి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం “యమునా నది”అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్,.నటుడు, దర్శక, నిర్మాత లయన్ సాయి వెంకట్, ,జబర్దస్త్ రాము, తాండవ కృష్ణ,ల చేతుల మీదుగా చిత్రంలోని పాటలను, ట్రైలర్ ను గ్రాండ్ గా విడుదల చేశారు. అనంతరం .. . గెస్ట్ గా వచ్చిన ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి. దర్శకుడు యన్. కె. సాయి మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాకు మంచి…
జమునకు టాలీవుడ్ నివాళి!
ఎంతో విచారకరం : చిరంజీవి సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు.మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది.ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను. కళాకారులకు మరణం ఉండదు : నందమూరి బాలకృష్ణ అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు జమున గారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి…
స్వర్గసీమకు వెండితెర సత్యభామ : సీనియర్ నటి జమున అస్తమయం
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో వన్ అండ్ ఒన్లీగా నిలిచిపోయిన సీనియర్ నటి జమున (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆమె 1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు. ఆయన 2014 నవంబరు 10లోనే గుండెపోటుతో మరణించారు. ఆమెకు కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి ఉన్నారు. ఉదయం నుంచే బంధువులు, సినీ ప్రముఖులు, అభిమానులు.. ఆమె ఇంటికి చేరుకుని నివాళులర్పించారు. ఉదయం 11 గంటలకు జమున పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకొస్తున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. దీంతో జమునను కడసారి చూసేందుకు సినీనటులు, ఆర్టిస్టులు, అభిమానులు అక్కడికి తరలివచ్చారు. అయితే మధ్యాహ్నం వరకు రాకపోవడంతో చాలాసేపు నిరీక్షించారు. మధ్యాహ్నం 2.45 గంటల కు ఇంటి నుంచి…
కళ్యాణం..కమనీయం సబిత-సాయికుమార్ ల వివాహమహోత్సవం!!
మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బిట్ల వెంకటేశ్వర్లు – బిట్ల పద్మ గార్ల ప్రథమ పుత్రిక చి.ల.సౌ. సబిత (ఎం.ఎస్) వివాహం శ్రీమతి అండ్ శ్రీ మంచాల రాజయ్య – లక్ష్మి గార్ల కనిష్ఠ పుత్రుడు చి. సాయికుమార్ (ఎం.టెక్)తో అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగింది. దైవజ్ఞులగు బ్రాహ్మణోత్తములచే 27 జనవరి 2023 శుక్రవారం ఉదయం 10.15 నిమిషములకు నిర్ణహించబడిన రేవతీ నక్షత్రయుక్త మీన లగ్న పుష్కరాంశ సుముహూర్తమున సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని సి. మల్లారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కళ్యాణోత్సవానికి అతిరథమహారధులు హాజరై నూతన వధూవరులను అక్షింతలతో నిండుమనస్సుతో కలకాలం ఈ జంట కన్నులపంటగా ఉండాలని ఆశీర్వదించారు. సూర్యచంద్రుల సాక్షిగా ముత్యాల పందిరిలో వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే పెద్దల సమక్షమున మూడుముళ్ల బంధంతో వేయి జన్మల బంధంగా నూతన వధూవరులైన సబిత…
‘సోదర సోదరీమణులారా…’ ఫస్ట్ లుక్ విడుదల
నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి రచన, దర్శకత్వంలో కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్న చిత్రం ‘సోదర సోదరీమణులారా…’. ఆకట్టుకునే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పక్కా స్క్రిప్ట్ తో పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో 35 రోజుల్లో తెరకెక్కిన ఈ సినిమా హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా గా ప్రేక్షకులను అలరించనుంది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ టాగ్ లైన్ తో కమల్ కామరాజు, అపర్ణాదేవి ఎమోషనల్ లుక్ తో ఉన్న ‘సోదర సోదరీమణులారా…’ ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఆకట్టుకుంటుంది. టైటిల్, పోస్టర్ తోనే అందరూ అన్వయించుకొనే పాత్రలతో…
Hunt Telugu Movie Review : ‘హంట్’ రివ్యూ.. యాక్షన్ ఎక్కువ..కథనం తక్కువ!!
నైట్రోస్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి యువ దర్శకుడు మహేష్ సూరపనేని దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ గురువారం (జనవరి 26, 2023) థియేటర్లలో విడుదలయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథలోకి… ఏసీపీ అర్జున్ (సుధీర్ బాబు) ఓ రోడ్డు ప్రమాదంలో మెమరీ లాస్ అవుతాడు. తన మిత్రుడు ఏసీపీ ఆర్యన్ దేవ్ ( భరత్ నివాస్) హత్యకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ను అతడు ఛేధించిన తర్వాత ఈ దుర్ఘటన జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ సమయంలో అర్జున్ కి యాక్సిడెంట్ జరిగి గతం మర్చిపోతాడు. ఎలాగైనా గతాన్ని గుర్తుచేసుకొని ఆర్యన్ హత్యకు కారకుడు ఎవడో తెలుసుకోమని అసిస్టెంట్ పోలీస్…