‘కొరమీను’ చిత్రం విడుదలైన మరుసటి రోజు మా నాన్న ఫోన్ చేసి “ఈ రోజుతో మా బెంగ, బాధ, భయం అన్నీ తీరిపోయాయిరా” అనడం “కొరమీను” సినిమాకి సంబంధించి మాత్రమే కాదు… నా జీవిదానికి సంబంధించి నేను అందుకున్న అతి పెద్ద కాంప్లిమెంట్ అండ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్” అంటున్నాడు యువ దర్శకుడు శ్రీపతి కర్రి. తన తొలి చిత్రంతోనే ఓ మోస్తరు “హల్ చల్” చేసిన ఈ వైజాగ్ కుర్రాడు తీసిన రెండో సినిమా “కొరమీను”కి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఆనంద్ రవి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సమన్యరెడ్డి నిర్మించారు. 2022కి ఘనమైన వీడ్కోలు పలికిన చిత్రంగా ప్రశంసలందుకుంటున్న “కొరమీను” చిత్రం ఇంత బాగా రావడంలో ఈ చిత్ర రచయిత, హీరో అయిన ఆనంద్ రవి, నిర్మాత సమన్య రెడ్డిలకే…
Month: January 2023
హైదరాబాద్ లో “లూయిస్ పార్క్” యాడ్ షూటింగ్!
గోకుల్ కోడ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చైర్మన్ కిషోర్ గారి ఆధ్వర్యంలో 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ తో వస్తున్నటువంటి గొప్ప బ్రాండ్ “లూయిస్ పార్క్”.ఈ బ్రాండ్ ను భారత దేశంలోనే మొదటి సారి ఏపీ తెలంగాణలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ నుండి వస్తున్న క్లాత్స్ లలో 100% ప్యూర్ లెనిన్ ఉంటుంది. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి ఒక యాడ్ తయారు చేశారు. ఈ యాడ్ ను హైదరాబాద్ లో సినిమాను తలదన్నేలా భారీ సెట్టింగ్స్ వేసి “లూయిస్ పార్క్” యాడ్ షూటింగ్ జరుపుకుంటుంది.ఆ యాడ్ ద్వారా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ లు ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం జరిగుతుంది. ఈ యాడ్ ను యాడ్స్ కింగ్ మేకర్…
నాగార్జున చేతుల మీద విడుదలైన ‘పాప్ కార్న్’ ట్రైలర్
డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఎమోషన్స్‌తో క్యూరియాసిటీ పెంచుతోన్న మూవీ ముఖ పరిచయం లేని అబ్బాయి, అమ్మాయి ఓ షాపింగ్ మాల్‌లోకి ఎంటర్ అవుతారు. అక్కడ షాపింగ్ పూర్తి చేసుకుంటారు. లిఫ్ట్ ఎక్కుతారు. ఎక్కగానే ఆ అమ్మాయి తాను లిఫ్ట్ నుంచి బయటకు వెళ్లిపోవాలనుకుంటుంది. ఆ అబ్బాయి తనని లాగి పెట్టి ఒకటి కొడతాడు.అడిగితే ప్రాంక్ చేశానంటాడు . అలాంటి ఈజీ గోయింగ్ మైండ్ సెట్ ఉన్న అబ్బాయి.. తనొక మ్యూజిషియన్.. ఇక అమ్మాయి విషయానికి వస్తే తనొక పెద్ద అందగత్తెననే అనే కాన్ఫిడెన్స్‌తో ఉంటుంది. ఇలాంటి భిన్నమైన మనస్తత్వాలున్న వీరిద్దరు అనుకోకుండా… షాపింగ్ మాల్‌లోని లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే ‘పాప్ కార్న్’ సినిమా చూడాల్సిందేనని అంటున్నారు దర్శక నిర్మాతలు. అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’.…
‘వారసుడు’ ఒక పండగలా వుంటుంది : హీరో శ్రీకాంత్ ఇంటర్వ్యూ..
దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లిల భారీ అంచనాల చిత్రం ‘వారసుడు/వారిసు’ తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా మీడియాతో శ్రీకాంత్ ‘వారసుడు’ చిత్ర విశేషాలని పంచుకున్నారు. విజయ్ ‘వారసుడు’ సినిమాతో మీ జర్నీ ఎలా మొదలైయింది ? సినిమా ఎలా వుండబోతుంది ? నా కెరీర్ లో తమిళ్ సినిమా చేయడం ఇదే…
సీనియర్ జర్నలిస్ట్, సినీ గేయరచయిత పెద్దాడ మూర్తి ఇకలేరు!
సినీ జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభించి అటు తర్వాత సినీ గేయ రచయితగా మారిన పెద్దాడ మూర్తి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య సంధ్య, కూతురు సుగాయత్రి, కుమారుడు అభిజిత్ ఉన్నారు. కూతురు సుగాయత్రి నెల్లూరులో ఇంటర్ చదువుతుండగా, కుమారుడు అభిజిత్ హైదరాబాద్ లో పదవ తరగతి చదువుతున్నాడు. సినీ జర్నలిస్టుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న పెద్దాడ మూర్తి దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రోత్సహంతో ‘కూతురు’ అనే చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుపెట్టాడు. ఆ తరువాత ఇడియట్, మధుమాసం, చందమామ, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పౌరుడు, కౌసల్య సుప్రజ రామ, స్టాలిన్ తదితర చిత్రాల్లో పాటలు రాసిన ఆయన ఇలా అర్ధాంతరంగా లోకం విడిచివెళ్లడంతో తోటి సినీ జర్నలిస్టులు,…
ఏప్రిల్ 14న విడుదల కానున్న అల్లరి నరేష్ ‘ఉగ్రం’
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో అల్లరి నరేష్ ఫెరోషియస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఒక స్పెషల్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. ఆ వీడియోలో నరేష్ బైక్ నడుపుతూ ఇంటెన్స్ గా కనిపించారు. బైక్‌ను ఆపి తుపాకీ తీసుకుని గట్టిగా అరుస్తూ ఎవరినో కాల్చాడం ఆసక్తికరంగా వుంది. వీడియో చివర్లో ఏప్రిల్ 14న విడుదల తేదీని ప్రకటించారు. నరేష్ తన తుపాకీని ఒకరిపై గురిపెట్టిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. వీడియో, పోస్టర్ నరేష్ పాత్ర యొక్క వైల్డ్ క్యారెక్టర్ ని తెలియజేస్తున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై…
రణబీర్ కపూర్ ‘యానిమల్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది!
తన తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బిగ్గర్ బ్లాక్ బస్టర్ ను అందించాడు. తెలుగు, హిందీలో తనదైన ముద్ర వేసిన సందీప్, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్న ‘యానిమల్’ తో సౌత్, నార్త్ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించనున్నాడు. భూషణ్‌కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా తో కలిసి టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ మేకర్స్ చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో రణబీర్ కపూర్ మాన్ స్టర్ అవతార్ లో కనిపించారు. యానిమల్ సందీప్ రెడ్డి వంగా…
నాగ చైతన్య ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ గ్లింప్స్ విడుదల
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. ‘కస్టడీ’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటివలే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 12, 2023న విడుదలవుతోంది. గ్రాండ్ గా న్యూ ఇయర్ 2023కి స్వాగతం పలుకుతూ.. ఈరోజు మేకర్స్ ఒక స్పెషల్ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి గ్లింప్స్…
‘లవ్ రెడ్డి’ గ్లిమ్స్ విడుదల!
గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్, బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ రెడ్డి’. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆంధ్ర, కర్ణాటక బాడర్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో స్మరన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. హేమలత రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర గ్లిమ్స్ ను దర్శకుడు ప్రశాంత్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ… ‘లవ్ రెడ్డి’ గ్లిమ్స్ చాలా ఫ్రెష్ గా ఉంది. నాకు కూడా ఒక లవ్ స్టొరీ చెయ్యాలని అనిపిస్తుంది ఈ గ్లిమ్స్ చూస్తుంటే, అందరూ యంగ్ టీమ్ కలిసి చేసున్న ఈ సినిమా…
19న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో అంజలి వెబ్ సిరీస్ ‘ఝాన్సీ సీజన్ 2’ స్ట్రీమింగ్
స్టార్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘ఝాన్సీ’. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 ఇప్పటికే విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. దర్శకుడు తిరు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మించారు. ‘ఝాన్సీ’ సీజన్ 2 జనవరి 19న స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేసింది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. సైకలాజికల్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కిన ఝాన్సీ వెబ్ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఆకట్టుకుంది. యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్…
