‘ది వాక్సిన్ వార్’ షూటింగ్ లో గాయపడ్డ నటి పల్లవి జోషి

Actress Pallavi Joshi Injured On The Vaccine War Sets In Hyderabad

”ది కాశ్మీర్ ఫైల్స్’ తో సంచలన సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘ది వాక్సిన్ వార్’ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ పతాకం పై పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కీలక పాత్ర పోహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ హైదరాబాద్‌ లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం సెట్ లో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా నటి పల్లవి జోషి గాయపడ్డారు. ఓ వాహనం అదుపు తప్పి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో సమీపంలోని హాస్పిటల్ లో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే వుందని, అభిమానులెవరు అందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర బృందం తెలియజేసింది. ది వాక్సిన్ వార్ లో…

నేచురల్ స్టార్ నాని ‘దసరా’ షూటింగ్ పూర్తి

నేచురల్ స్టార్ నాని 'దసరా' షూటింగ్ పూర్తి

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ మెటీరియల్‌కి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ధూమ్ ధామ్ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ని దూకుడుగా చేస్తోంది. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలో తన లుక్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా…

Natural Star Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, SLV Cinemas’ Dasara Shooting Wrapped Up

Natural Star Nani’s most-awaited Pan India film Dasara is getting ready for its grand theatrical release worldwide on March 30th. Every promotional material of the movie was well-received. Particularly, Dhoom Dhaam song received a tremendous response. Meanwhile, the film’s entire shooting part has been completed. The post-production works are presently happening for the movie and the team will intensify the promotions, as the production formalities are done. “An Epic called #DASARA is done 🔥 It’s a wrap. This diamond will shine FOREVER ♥️.” posted Nani who also shared a video.…

ఫిబ్రవరి 3న థ్రిల్లర్ ‘సువర్ణ సుందరి’ విడుదల

ఫిబ్రవరి 3న థ్రిల్లర్ ‘సువర్ణ సుందరి’ విడుదల

డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సురేంద్ర మాదారపు మాట్లాడుతూ.. ‘‘అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో తెలుగు సినిమా ఇండస్ట్రీని.. ప్రపంచం మెచ్చుకునే స్థాయిలో నిలబెట్టిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కి, రాజమౌళిగారికి ధన్యవాదాలు. ‘సువర్ణసుందరి’ సినిమా విషయానికి వస్తే.. ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్,…

గెటప్ శ్రీను ‘రాజు యాదవ్’ టీజర్ విడుదల

Rajuyadav Movie Still

సాయి వరుణవి క్రియేషన్స్ బ్యా నర్ పై గెటప్ శ్రీను కథానాయకుడిగా రూపొందిన చిత్ర “రాజుయాదవ్ “. సూడో హీరోయిజం జోనర్ లో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తునన్నారు. కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో వున్న రాజు యాదవ్ టీజర్ ని సంక్రాంతి కానుకగా ఈ రోజు విడుదల చేశారు మేకర్స్. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ టీజర్ లో లవ్ కామెడీ తో పాటు మంచి ఎమోషన్స్ తో ఆసక్తికరంగా వుంది. బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను తనలో వున్న కంప్లీట్ యాక్టర్ ని ఆవిష్కరించేలా ఈ సినిమా వుండబోతుందని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. టీజర్ లో గెటప్ శ్రీను నటన అవుట్…

వెండితెర ‘రాముడు’ సూచించిన ‘ రామబాణం’

వెండితెర 'రాముడు' సూచించిన ' రామబాణం'

-గోపీచంద్ , శ్రీవాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సినిమా “రామబాణం” -సంక్రాంతి శుభవేళ చిత్రం పేరు ప్రకటన.. ఆకట్టుకుంటున్న ప్రచార చిత్రం మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించారు. ఇప్పుడు మూడో సారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు.ఇందులో హీరో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు,అన్నయ్యగా, కుష్బూ వదిన గా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతోన్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నాయి. సంక్రాంతి శుభవేళ చిత్రం పేరు ను…

‘వాల్తేరు వీరయ్య’ విజయం సమిష్టి కృషి: మెగామాస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి

‘వాల్తేరు వీరయ్య’ విజయం సమిష్టి కృషి: మెగామాస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి

వాల్తేరు వీరయ్యకి చిన్నపిల్లలు కూడా గొప్పగా కనెక్ట్ అవుతున్నారు: మాస్ మహారాజా రవితేజ చిరంజీవి గారు ఇచ్చిన ఫ్రీడమ్ వలనే ఇంత గొప్ప విజయం వచ్చింది : దర్శకుడు బాబీ కొల్లి వాల్తేరు వీరయ్య చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ అవుతుంది: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మెగామాస్ బ్లాక్…

ఆకట్టుకున్న ‘వాల్తేరు వీరయ్య’

Waltair Veerayya Movie Review In Telugu

మెగాస్టార్ చిరంజీవి – రవితేజ కలయికలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించారు. బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి. చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్ తన మాస్-అప్పీలింగ్ కంపోజిషన్లతో భారీ అంచనాలను నెలకొల్పాడు. మ్యూజికల్ ప్రమోషన్స్‌ ఊపందుకునేలా సాగాయి. ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’.ఈ శుక్రవారం (13, జనవరి – 2023) విడుదలైంది. మరి సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా..లేదా.. ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే…

‘వాల్తేరు వీరయ్య’ మాస్ యుఫోరియా మాములుగా వుండదు : రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇంటర్వ్యూ

‘వాల్తేరు వీరయ్య’ మాస్ యుఫోరియా మాములుగా వుండదు : రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇంటర్వ్యూ

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన వాల్తేరు వీరయ్య అల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అల్బమ్‌ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకలు లోడింగ్, నీకేమో అందం ఎక్కువ పాటలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతున్న నేపధ్యంలో సంగీత…

ఆక‌ట్టుకుంటోన్న యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ జీ5 ఏటీఎం ట్రైల‌ర్‌

ATM Trailer

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ హరీష్ శంక‌ర్ క్రియేట్ చేసిన సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘ఏటీఎం’ జనవరి 20 నుంచి జీ 5లో ప్రీమియర్ కానుంది. దిల్ రాజు ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సిరీస్ ట్రైల‌ర్‌ను మేకర్స్ విడుద‌ల చేశారు. జ‌గ‌న్ (బిగ్ బాస్ తెలుగు విజేత వి.జె.స‌న్నీ), పోలీస్ ఆఫీస‌ర్ (సుబ్బ‌రాజ్ ) మ‌ధ్య జ‌రిగే యుద్ధ‌మే ఏటీఎం. దోపిడి ప్ర‌ధానంగా సాగే యాక్ష‌న్ క్రైమ్ డ్రామాలో రియ‌లిస్టిక్ యాక్ష‌న్‌, రా ఎలిమెంట్స్ ఇత‌ర ఎలిమెంట్స్ అన్నీ మిళిత‌మై ఉన్నాయి. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే జ‌గ‌న్ పాత్ర‌ధారి మ‌నిషి ఎద‌గ‌డానికి స‌రైన మార్గం.. త‌ప్పుడు మార్గాల గురించి మాట్లాడుతాడు. అత‌డు ద‌ర్జాగా, విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌టానికి ఎలాంటి మార్గం ఎంచుకున్నాడనేదే క‌థాంశం. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో దీన్ని ఎంగేజింగ్‌గా తెర‌కెక్కించారు. న‌లుగురు కుర్రాళ్లు రూ.25 కోట్ల‌ను…