స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సీతారామం’ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ప్రీరిలీజ్ చాలా గ్రాండ్ గా జరిగింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ.. సీతారామం ట్రైలర్ ఎక్స్ ట్రార్డినరీగా వుంది. దుల్కర్ సల్మాన్ హ్యాండ్ సమ్ హీరో, సూపర్ స్టార్. మహానటి లాంటి గ్రేట్ ఫిల్మ్ లో చేశారు. మృణాల్…
Year: 2022
‘మసూద’ టీజర్ కు ట్రైమండస్ రెస్పాన్స్!!!
-టాబ్లెట్స్ తో తనకు నయం అవుతుందని నాకు అనిపించట్లేదు గోపి అంటూ ‘మసూద’ టీజర్ లో సంగీత చెప్పే డైలాగ్స్ వాహ్.. అనిపించింది. – ఇప్పుడైతే బానే ఉంది కదండి… – అప్పుడప్పుడు తను చేసేది చూస్తుంటే ఎప్పుడైనా పీర్ బాబాకు చూపిస్తుంటే మంచిదేమో ఏమంటావ్ ? అని సంగీత అంటే.. – నాకు అస్సలు ఐడియా లేదు.. ఇలాంటి డైలాగ్స్ తో ప్రారంభమైన ‘మసూద’ టీజర్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘మసూద’. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్ ట్రైమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. మంగళవారం న్యాచురల్ స్టార్ నాని ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించి.. టీజర్ ప్రామిసింగ్‌గా ఉందని, ప్రతి ఒక్కరూ…
First glimpses of the movie starring Siva Kandukuri as Bhootadham Bhaskar Narayana in complete new avathar.
The current trend is not how great the movie is made but how unique the promotion is. Bhaskar Narayana is taking all precautions to attract the audience to the cinema theatres. Introducing Purushottam Raj as a director, Bhootaddham Bhaskar Narayana is a film produced by Snehal Jangala, Shasidhar Kashi, and Karthik Mudumbai jointly under the banners of Million Dreams Creations and Vijay Saraga Productions without compromising on the production values. The first glimpse of the film was released today. Shiva Kandukuri plays the hero role, and Rashi Singh plays the…
డిఫరెంట్ ప్రజెంటేషన్‌లో ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’గా శివ కందుకూరి నటించిన సినిమా ఫస్ట్ గ్లింప్స్
సినిమా ఎంత గొప్పగా నిర్మించామన్నది కాదు, ప్రమోషన్ ఎంత డిఫరెంట్‌గా చేశామన్నదే ఇప్పటి ట్రెండ్. ప్రేక్షకుల్ని సినిమా థియేటర్లకు రప్పించడానికి ఇప్పటి నుంచే ప్రేక్షకులకు నచ్చేలా అన్ని జాగ్రత్తలు తీసుకుని వారి అభిరుచిని భూతద్ధంలోంచి చూస్తున్నాడు మా భాస్కర్ నారాయణ. పురుషోత్తం రాజ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రొడక్షన్ విలువలు ఎక్కడా తగ్గకుండా, కథని నమ్మి నిర్మించిన చిత్రమే ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని ఈరోజు విడుదల చేశారు. ఈ చిత్రంలో శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ లో ఓపెన్ చేస్తే శేషపాన్పుపై పవళించిన…
ఆ ఆలోచనలో నుంచే ‘బింబిసార’ కథ పుట్టింది : దర్శకుడు వశిష్ట్ చెప్పిన సంగతులు..
నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్. వశిష్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 5న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వశిష్ట సినిమా గురించి విశేషాలను తెలియజేశారు. అవి అయన మాటల్లోనే.. – 2018లో ‘బింబిసార’ జర్నీ ప్రారంభమైంది. సాధారణంగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఏదో కాలంలోకి వెళ్లినట్లు చూపించారు. కానీ ఇదే కాలానికి చెందిన ఓ రాజు మరో పీరియడ్‌లోకి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో నుంచే ‘బింబిసార’ కథ పుట్టింది. – కథంతా ఓ ఫార్మేట్‌లోకి వచ్చిన తర్వాత కళ్యాణ్‌గారికి ‘మిమ్మల్ని ఓసారి కలవాలని అనుకుంటున్నాను’ అంటూ మెసేజ్ పంపాను. పటాస్…
ఆగస్ట్ 6న విడుదల కానున్న యంగ్ హీరో నిఖిల్, చందూ మొండేటి ‘కార్తికేయ 2’ థియేట్రికల్ ట్రైలర్
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ 1 పై అద్భుతమైన స్పందన వచ్చింది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో సాగే ట్రైలర్ 1 ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆగష్టు 6నా కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు…
‘సీతా రామం’లో సీత పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నా : మృణాల్ ఠాకూర్ ఇంటర్వ్యూ
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులని మెస్మరైజ్ చేసి చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆగస్ట్5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో కథానాయిక మృణాల్ ఠాకూర్ మీడియాతో పంచుకున్న ‘సీతారామం’ చిత్ర విశేషాలివి. # మీ కెరీర్ సీరియల్ తో మొదలైంది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేయడం ఎలా అనిపిస్తుంది? – నా మొదటి సీరియల్ బాలీవుడ్‌లో `కుంకుమభాగ్య.` అది అన్ని భాషల్లో డబ్ అయింది నాకు మంచి పేరు…
ప్రముఖ హస్యనటుడు సారధి కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు సారథి (83) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణావార్తతో టాలీవుడ్‌లో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు తెలుగు సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన దాదాపు 372 పైగా చిత్రాల్లో నటించారు. అందులో సీతారామ కళ్యాణం, పరమానందయ్య శిష్యుల కథ, భక్త కన్నప్ప, జగన్మోహిని, మన ఊరి పాండవులు, డ్రైవర్ రాముడు వంటి మరెన్నో చిత్రాలతో గుర్తింపు పొందారు. అంతేకాదు తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు.…
‘సీతారామం’ చిత్రం చరిత్రలో నిలుస్తుంది : అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఇంటర్వ్యూ..
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో నిర్మాత అశ్వినీదత్ మీడియాతో పంచుకున్న ‘సీతారామం’ చిత్ర విశేషాలివి. # సీతారామం మీ బ్యానర్ లో మరో ‘మహానటి’ అవుతుందని భావిస్తున్నారా ? – చాలా మంచి సినిమా తీశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. ఎప్పటినుండో మంచి ప్రేమకథ తీయాలని అనుకుంటున్నాను. సీతారామంతో ఆ కోరిక తీరింది. బాలచందర్ గారి మరో చరిత్ర, మణిరత్నం గారి గీతాంజలి చరిత్రలో నిలిచిపోయాయి. సీతారామం కూడా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే…
‘అలిపిరికి అల్లంత దూరంలో’ ఫస్ట్ లుక్ విడుదల
కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని దర్శకురాలు నందిని రెడ్డి లాంచ్ చేసి యూనిట్ కు బెస్ట్ విశేష్ అందించారు. ఫస్ట్ లుక్ లో ఒక హొటల్ టెర్రస్ పై హీరో సీరియస్ గా నిలుచుని చూడటం, బ్యాగ్రౌండ్ లో తిరుమల సప్తగిరులు కనిపించడం ఆసక్తికరంగా వుంది. నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు.…
