‘అజయ్ గాడు’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సత్యదేవ్

'అజయ్ గాడు' ఫస్ట్ లుక్ విడుదల చేసిన సత్యదేవ్

ఇటీవల విశ్వక్‌తో ముద్ర వేసిన అజయ్ కతుర్వార్ తన రాబోయే చిత్రంతో ప్రేక్షకులను ఉత్తేజపరిచేందుకు సిద్ధమయ్యాడు. అతను ఇటీవల తన రాబోయే చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫస్ట్‌లుక్‌ని ఈరోజు విడుదల చేసారు. టాలెంటెడ్ యంగ్ హీరో సత్య దేవ్ ఫస్ట్ లుక్ మరియు టైటిల్‌ను ఆవిష్కరించి మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. “అజయ్ గాడు” అనే టైటిల్ అందర్నీ ఆకట్టుకుంది. అజయ్ కతుర్వార్ ఇప్పుడు తన ఫస్ట్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. త్వ‌ర‌లోనే ఫైర్ టీజ‌ర్‌ను కూడా విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఉత్తేజకరమైన ప్రాజెక్ట్‌ను అజయ్ కర్తుర్వార్ దర్శకత్వం వహించారు మరియు చందనా కొప్పిశెట్టి సహకారంతో అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు. అందాల భామలు భానుశ్రీ, శ్వేతా మెహతా…

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ నుండి నయనతార ఫస్ట్ లుక్ విడుదల

Nayanthara’s First Look As Sathyapriya Jaidev In Megastar Chiranjeevi –Mohan Raja - Konidela Productions And Super Good Films – GodFather

మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్‌ ‘గాడ్ ఫాదర్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే చాలా మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి ఈ చిత్రంలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తున్నారు. చిరంజీవి పాత్రను పరిచయం చేస్తూ ఇటివల విడుదలైన గ్లింప్స్, టీజర్ లకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమాలో నయనతార పాత్ర ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఇందులో ఆమె సత్యప్రియ జైదేవ్ పాత్రను పోషిస్తున్నారు. నయనతార కాటన్ లినెన్ చెకర్డ్ చీరలో సాంప్రదాయకంగా కనిపిస్తోంది. టైప్‌రైటర్‌లో లెటర్ ని రెడీ చేస్తూ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు నయనతార. త్వరలోనే చిత్ర యూనిట్…

‘ఒకే ఒక జీవితం’ మీ అందరికీ నచ్చుతుంది : ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

oke oka jeevitham movie pre relese event

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగు అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలౌతుంది ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ జరిగింది. ఈ చిత్రంలోని నటీనటుల మాతృమూర్తులు ఈ వేడుకకు హాజరవ్వడం ఆకట్టుకుంది. అమల అక్కినేని మాట్లాడుతూ.. ‘ఒకే ఒక జీవితం’లో నటించడం చాలా మంచి అవకాశం. ఈ సినిమా చేయడానికి అన్ని రాష్ట్రాల నుండి…

‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో ‘దక్షిణ’

'కబాలి' ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో 'దక్షిణ'

‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దక్షిణ’. ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రలో విజయవంతమైన మహిళా ప్రాధాన్య చిత్రాలు ‘మంత్ర’, ‘మంగళ’ తీసిన ఓషో తులసీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు.  ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. నేడు రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ చేశారు.  హైదరాబాద్‌లోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ‘దక్షిణ’ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత వంశీకృష్ణ ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రణతి, శ్వేతా భావన క్లాప్ ఇచ్చారు. ఈ సందర్బంగా.. చిత్ర నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ ”సాయి ధన్సిక, ఓషో తులసీరామ్ కలయికలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. తెలుగులో…

‘మిస్టర్ కింగ్’ నుండి ‘నేనెరగని దారెదో’ పాట విడుదల

'మిస్టర్ కింగ్' నుండి 'నేనెరగని దారెదో' పాట విడుదల

విజ‌య నిర్మల గారి మ‌న‌వుడు శరణ్ కుమార్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సీనియ‌ర్ న‌రేశ్ అల్లుడు (న‌రేశ్ క‌జిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా`మిస్టర్ కింగ్`చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని హన్విక క్రియేషన్స్ ప‌తాకంపై బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నుండి ‘నేనెరగని దారెదో’ పాటని చిత్ర యూనిట్ విడుదల చేసింది. యూత్ ఫుల్ మెలోడీ నెంబర్ గా ఈ పాటని అద్భతంగా స్వరపరిచారు మణిశర్మ. హారిక నారాయణ్ పాటని పాడిన విధానం లవ్లీగా వుంది. ♫ నేనెరగని దారెదో నన్నే చేరి నా నడకని మార్చేసిందా ? నేతలవని మాయేదో నీలా సోకి నా బ్రతుకును అల్లేసిందా..? నువ్వు పిలిచినా.. పేరు నాదని అననా.. నువ్వు నడిచినా దారే.. నడకవానా..♫ ఈ…

‘కెప్టెన్’ ఒక డిఫరెంట్ సినిమా : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ఆర్య

'కెప్టెన్' ఒక డిఫరెంట్ సినిమా : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ఆర్య

ఆర్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘కెప్టెన్’. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించారు. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ & హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్బంగా .. హీరో ఆర్య మాట్లాడుతూ ”తెలుగు నా తొలి సినిమా ‘వరుడు’. అందులో అల్లు అర్జున్ గారితో నటించాను. ఆ సినిమా లో డైలాగులు అన్నీ ప్రోపర్…

ఫిలిం ఛాంబర్ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తా: నట్టి కుమార్

nattikumar producer

తన యాభై ఏళ్ళ జీవన ప్రయాణంలో దాదాపు 30 ఏళ్ళ పాటు సినీరంగంలోనే కొనసాగుతూ వస్తున్నానని ప్ర‌ముఖ నిర్మాత న‌ట్టికుమార్ వెల్లడించారు. గురువారం త‌న 50వ పుట్టిన‌రోజును పురసరించుకుని బుధవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన పైవిధంగా స్పందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి కేక్ కట్ చేసి, నిరాడంబ‌రంగా తన బర్త్ డేని జ‌రుపుకున్నారు. అలాగే పలు విషయాల గురించి ఈ సమావేశంలో నట్టి కుమార్ మాట్లాడారు. 30 ఏళ్ళకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగిన నేను, ఇతర వ్యాపార రంగాల్లోనికి ప్రవేశిస్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితులలో సినిమా రంగాన్ని వదిలిపెట్టనని, ఇక్కడ ఉంటూనే అనేక ప్రయోగాలు చేయాలనుకుంటున్నాని ఆయన చెప్పారు. ఇటీవ‌ల కొంద‌రు నిర్మాత‌లు ఏకాభిప్రాయంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని…త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు బంద్‌కు పిలుపునిచ్చారు.…

‘కొత్త కొత్తగా’ చాలా కొత్తగా వుంటుంది : ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

'కొత్త కొత్తగా' చాలా కొత్తగా వుంటుంది : ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శక‌త్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ `కొత్త కొత్తగా’. బి జి గోవింద రాజు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. దర్శకులు మారుతి, త్రినాథ్ రావు నక్కిన, గోపినాథ్ రెడ్డి ఈ ఈవెంట్ లో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. మారుతి మాట్లాడుతూ.. చిన్న సినిమా సూపర్ హిట్ కొట్టాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరని. నన్ను ఈ స్థాయిలోకి తెచ్చింది చిన్న సినిమానే. నిర్మాత గోవింద రాజు కి సినిమా పట్ల ప్యాషన్. ఈ సినిమా పాటలు ఇంత సక్సెస్ కావడానికి కారణం ఆయనే అని భావిస్తున్నాను. చిన్న…

HBD Divya Sripada from Team Charitha Kamakshi

HBD Divya Sripada from Team Charitha Kamakshi

Charitha Kamakshi is one of the upcoming Telugu films, starring Divya Sripada and Naveen Bethiganti in the lead roles. Divya Sripada shot to fame with short films and then she acted in web series. She impressed everyone big time and has been playing the lead role in the film. On the occasion of her birthday today, the makers launched her look from the film and introduced her character. It looks like Divya and Naveen are playing a couple in the film. While Naveen is writing something, Divya enters his room…

నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద ‘చరిత కామాక్షి’ సినిమా నుంచి ‘ది వరల్డ్ ఆఫ్ చరిత కామాక్షి’ విడుదల..

HBD Divya Sripada from Team Charitha Kamakshi

ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్ పై రజినీ రెడ్డి నిర్మాతగా చందు సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘చరిత కామాక్షి’. నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో దివ్య శ్రీపాద టైటిల్ రోల్ చరిత కామాక్షి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా దివ్య శ్రీపాద పుట్టినరోజు సందర్భంగా ది వరల్డ్ ఆఫ్ చరిత కామాక్షి విడుదలైంది. చక్కటి చీరకట్టులో.. గృహిణి పాత్రలో.. చూడగానే గౌరవం ఉట్టిపడే విధంగా ఈ పాటలో కనిపిస్తున్నారు హీరో హీరోయిన్లు. చిరునవ్వుతో ఎంతో అందంగా కనిపిస్తున్నారు దివ్య శ్రీపాద. అబూ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కోడాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్. రాకీ వనమాలి సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు. నటీనటులు:…