వరుస సినిమాలతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు దూసుకుపోతున్నారు. ఇటీవలే క్యాలీ ఫ్లవర్ సినిమా విడుదలై ప్రేక్షకులను నవ్వులతో పులకరించేలా చేసింది. ఇప్పుడు తాజాగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా “Mr బెగ్గర్” సినిమా షూటింగ్ ప్రారంభం త్వరలో కానుంది. కార్తీక్ మూవీస్ పతాకంపై వడ్ల జనార్దన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని నిర్మాతలు గురురాజ్, కార్తిక్ వడ్ల నిర్మిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి పెద్దపల్లి రోహిత్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ఫణీంద్ర వర్మ అల్లూరి. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్.
Year: 2022
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కెయూరాకు సుచిరిండియా అధినేత లయన్ కిరణ్ లక్ష రూపాయల బహుమతి
లయన్ కిరణ్ సుచిరిండియా అధినేత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కెయూరాను ప్రోత్సహించేందుకు లక్ష రూపాయలను అందించారు. జూబ్లీహిల్స్‌లోని సుచిరిండియా కార్యలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సుచిరిండియా సీఎండి లయన్ కిరణ్ కుమార్ లక్ష రూపాయల చెక్కును ఆమెకు అందించారు. ఈ సందర్భంగా లయన్ కిరణ్ మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా భారత్ తరుపున పోటీపడి పతకాలు సాధించి వారు ప్రపంచ స్థాయిలో భారత్‌కు గుర్తింపు తీసుకొస్తారన్నారు. ఈ నేపథ్యంలో గత 15 ఏళ్లుగా క్రికెట్ నుంచి మొదలుకొని అన్ని రకాల క్రీడాకారులకు సుచిరిండియా తరుపున అవసరమైన సామాజిక ఆర్థిక సహాకారాన్ని అందిస్తున్నామని అన్నారు. యువ క్రీడాకారలను గుర్తించి వారికి అవసరమైన సాయాన్ని అందించడం ద్వారావారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారన్నారు. కెయూరాకు మున్ముందు అవసరమైన మరింత సాయాన్ని అందిస్తామన్నారు. ఇప్పటికే సుచిరిండియా తరుపున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు అవసరమైన సాయాన్ని…
జాతీయస్థాయి కరాటేలో రాణిస్తున్న మేకల దీక్షిత్
హైదరాబాద్‌కు చెందిన మేకల దీక్షిత్ జాతీయస్ధాయి కరాటేలో రాణిస్తున్నాడు. మన్సూరాబాద్ నాగార్జున స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న దీక్షిత్, డిసెంబర్ 25,26 తేదీల్లో మీరట్‌లో జరిగిన జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో బ్లూ బెల్ట్ కేటగిరిలో ద్వితీయస్ధానం సాధించాడు. త్వరలో కెనడాలో జరిగే కెంజూట్ ఇంటర్నేషనల్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రయినింగ్ క్యాంపులో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. మాస్టర్ B. రాము వద్ద సంవత్సరం నుంచి శిక్షణ తీసుకుంటున్నట్లు దీక్షిత్ తండ్రి మేకల దుర్గయ్య తెలిపారు. కెనడాలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు దీక్షిత్‌కు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. కరాటే ఆత్మరక్షణ క్రీడ మాత్రమే కాదని, అది ఆత్మస్థైర్యాన్ని కూడా కల్పిస్తుందని తెలిపారు.
DJ Tillu, produced by Sithara Entertainments, starring Siddhu Jonnalagadda, Neha Shetty, to storm theatres on January 14
DJ Tillu, starring Siddhu Jonnalagadda and Neha Shetty in the lead roles, is a mad-cap thriller directed by debutant Vimal Krishna and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. The lead actor Siddhu (who has also written the dialogues) and director Vimal Krishna have jointly scripted it and penned the screenplay. The film, whose riveting teaser piqued the curiosity of audiences recently, is all set to storm the theatres for the Sankranti season on January 14. The makers, announcing the news, had released a poster of DJ Tillu featuring…
సిద్దు జొన్నలగడ్డ చిత్రం ‘డిజె టిల్లు’ జనవరి 14 న విడుదల
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’. ఈ చిత్రం జనవరి 14-2022 న విడుదల అవుతోంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని కూడా ఈరోజు విడుదల చేసింది. ప్రచార చిత్రాన్ని గమనిస్తే… నాయిక పాదాలను, కథానాయకుడు తన పెదాలతో స్పృశించటం చూస్తుంటే’డిజె టిల్లు’ ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తోంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదనిపిస్తుంది. ఇటీవల విడుదల అయిన’డిజె టిల్లు’ టీజర్ కూడా పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకుందన్నది స్పష్టం. అందులోని దృశ్యాలు గానీ, సంభాషణలు గానీ ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. నూతన దర్శకుడువిమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు ఆయన…
”Reality is wrong. Dreams are for real”
“A picture is worth a thousand words”. Life’s journey is all about dreaming and doing something to achieve that dream. The ability to imagine something larger than life forms the essence of living. ‘Kala’ is a musical attempt to depict the dream of many. ‘Kala’ is a musical video song, shot in picturesque locations of Goa and Hyderabad. Featuring the promising and beautiful actress Heena S, the song is rendered by the well-known singer Neha Karode. As we are about to step into a new year filled with many aspirations,…
హీరోగా మారుతున్న నటుడు అభినవ్ గోమఠం!!
మళ్ళీ రావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, ఇచ్చట వాహనములు నిలపరాదు* వంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల శ్యామ్ సింగ రాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షక లోకానికి మరింత దగ్గరైన అభినవ్ గోమఠం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ కొత్త దర్శకుడు దర్శకత్వంలో కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. జనవరి ఒకటో తేదీ అభినవ్ గోమఠం పుట్టిన రోజు సందర్భంగా సినిమా గురించి ప్రకటన చేశామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది చిత్రయూనిట్.
జనవరి 14 ‘రాధే శ్యామ్’ విడుదలలో మార్పులేదు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన తాజా భారీ సినిమా ‘రాధే శ్యామ్’. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా వచ్చే సంక్రాంతి రేస్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇదిలా ఉండగా న్యూఇయర్ పెను మార్పులతో ఆరంభమయింది. అయితే.. సంక్రాంతి బరిలో ఉన్న భారీ సినిమా ‘ట్రిపుల్ ఆర్’ వాయిదా పడడంతో చిత్రసీమ షేక్ అయింది. అయితే.. ‘ట్రిపుల్ ఆర్’ వెనక్కి వెళితే.. ‘రాధే శ్యామ్’ కూడా విడుదల వాయిదా పడడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కీలక అంశాలతో టాలీవుడ్ రగులుతుండగా ఒక కూల్ పోస్టర్ తో ‘రాధే శ్యామ్’ యూనిట్ మాత్రం సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటిస్తూ జనవరి 14 డేట్ ని ఈ…
విడుదలకు సిద్దమైన ‘హలో జూన్’
ఆంట్స్ టు ఎలిపెంట్స్ సినిమాస్ కో ప్రొడక్షన్ పై మోజ్విత్ అండ్ చరణ్ తేజ్ సమర్పణలో వస్తున్నమంచి ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్రెండ్ షిప్ స్టోరీ ‘హలో జూన్’. ప్రస్తుతం అన్ని హంగులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా నిర్మాతలు అనిల్ రెడ్డి.ఎం, జయప్రకాశ్ వి. చిత్రానికి సంబంధించిన విశేషాలను వివరిస్తూ ..”ఒక మంచి చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళంలో కూడా విడుదల చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం ఒక ఫీల్ గుడ్ మూవీ. ఒక అమ్మాయి జీవితంలో డ్రీమ్స్ ఎలా ఉంటాయో అన్నది ప్రధానంగా సాగుతూ ఆద్యంతం ఆసక్తికరంగా వినోదాన్ని పంచుతూనే ప్రేక్షకులను బాగా ఆలోచింపజేస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ సినిమా ఓ అమ్మాయి జీవితంలో జరిగే టెన్ ఇయర్స్ ఫ్రెండ్ షిప్ అండ్ లవ్…
ట్రిపుల్ ఆర్ విడుదల వాయిదా!
ఇప్పుడు టాలీవుడ్ లో అంతా అయోమాయం చోటుచేసుకుంది. జనవరి 7న వస్తుందనుకున్న ప్యాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ విడుదల వాయిదాపడడంతో అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా కంగుతిన్నాయి. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమైన ట్రిపుల్ ఆర్ విడుదల కోసం ప్రపంచ సినీ ప్రేమికులు కొంత కాలంగా ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా విడుదలకు పకడ్భంది ఏర్పాట్లు చేసారు. అయితే.. అంతా ఒకే అనుకుంటున్న సమయంలోనే ఈ చిత్రానికి కరోనా, ఒమిక్రాన్ ల దెబ్బ తగిలి విడుదల వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు కరోనా మూడో దశ ప్రారంభమయింది. కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మహరాష్ట్రలో అయితే.. కరోనా ఫలితంగా తొమ్మిది గంటలకే అన్నీ సర్దేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.…
