కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ (46) తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలి పడిపోయిన ఆయన్ని కుటుంబసభ్యులు వెంటనే విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు విక్రమ్ ఆస్పత్రి వైద్యులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్‌కుమార్. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన పునీత్.. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బెట్టడా హువు’ చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. హీరోగా ఇప్పటివరకూ ఆయన 32 చిత్రాల్లో నటించారు. ‘వసంత గీత’, ‘భాగ్యవంత’, ‘ఏడు నక్షత్రాలు’, ‘భక్త ప్రహ్లాద’, ‘యరివాను’ వంటి చిత్రాలు ఆయనకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘యువరత్న’…
Day: October 29, 2021
రొమాంటిక్ : యాక్షన్ హంగామా!
చిత్రం: రొమాంటిక్ విడుదల తేది : అక్టోబర్ 29, 2021 రేటింగ్ : 4/5 నటీనటులు: ఆకాష్ పూరి, కేతిక శర్మ, రమ్య కృష్ణ, ఉత్తేజ్, సునయన, రమా ప్రభ, దేవయాని, మకరంద్ దేశ్ పాండే తదితరులు. నిర్మాణం: పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మికథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు: పూరి జగన్నాథ్‌దర్శకత్వం: అనిల్ పాదురిసంగీతం: సునీల్ కశ్యప్సినిమాటోగ్రఫీ: నరేష్ రానాఎడిటర్: జునైడ్ సిద్దికిఆర్ట్: జానీ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్ పై అనిల్ పాదురి దర్శకత్వంలో పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన చిత్రం ‘రొమాంటిక్’ తాజాగా నేడు (అక్టోబర్ 29) ప్రేక్షకుల ముందుకొచ్చింది. గత రెండేళ్లుగా నిర్మాణం లో ఉన్న పూరి జగన్నాథ్ – ఛార్మిల తాజా…
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ (మార్కెటింగ్)గా వి. సతీష్ కుమార్ బాధ్యతలు స్వీకరణ
భారతదేశపు అతిపెద్ద వాణిజ్య సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ (మార్కెటింగ్)గా వీ సతీష్ కుమార్ (56) బాధ్యతలు స్వీకరించారు. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్టింగ్‌లలో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ (మార్కెటింగ్)గా అధిరోహణకు ముందు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లకు వ్యాపార అధిపతిగా ఉన్నారు. రిటైల్, డైరెక్ట్ సేల్స్, ఎల్‌పీజీ, ల్యూబ్ సేల్స్, ఆపరేషన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్, హెచ్ఆర్‌డీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పర్యవేక్షించేవారు. ఎల్‌పిజీ వినియోగదారుల కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటిఎల్), ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (పీఎంయువై), బీఎస్-6 ఇంధనానికి మారడం వంటి కీలక వ్యాపార కార్యక్రమాలను అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అతను దేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాలలో పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్‌లో మూడు దశాబ్దాలకు పైగా నైపుణ్యాన్ని బోర్డుకి తీసుకువచ్చారు.సతీష్ కుమార్ ప్రస్తుతం బెక్సిమ్‌కో…
పార్టనర్‌షిప్ ఫర్ గ్రోత్ 3.0ను విడుదల చేసిన NXTDIGITAL
తమ నెట్‌వర్క్‌ను 40 నూతన NXTHUB లతో దేశవ్యాప్తంగా విస్తరణ : తమ యాప్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటన భారతదేశ వ్యాప్తంగా 40 నూతన NXTHUBs ఏకకాలంలో ప్రారంభం – ప్రతి ఒక్కటీ 650కు లైవ్ టీవీ ఛానెల్స్ మరియు బ్రాండ్‌బ్యాండ్ అందిస్తాయి. ప్రస్తుతం 4400 పిన్‌కోడ్స్ వ్యాప్తంగా NXTDIGITAL కు ఉన్న ప్రస్తుత కవరేజీకి జోడింపు•ప్రతి NXTDIGITAL సొంతమైన మరియు నిర్వహిస్తున్న NXTHUBs లోనూ యాడ్స్ లేదా అడ్వాన్స్‌డ్ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. ఇది లాస్ట్ మైల్ ఓనర్స్ (LMOలు)కు ప్లగ్ అండ్ ప్లే పరిష్కారం అందిస్తుంది. ఈ వీడియో పరిష్కారం HITS లేదా Headend-In-The-Sky సాంకేతికత ఆధారంగా ఉంటుంది. ఇది శాటిలైట్ ఆధారితం కావడంతో పాటుగా వాతావరణం, భౌగోళిక పరిస్థితులు లేదా కనెక్టివిటీ అవరోధాలు ఉండవు.•హెడ్–ఎండ్స్ లేదా సంబంధిత సాంకేతికలో ఎల్‌ఎంఓలు…