సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ విడుదలకు సిద్దమౌతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ‘సర్కారు వారి పాట’కు పనిచేసిన స్టార్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న ‘సర్కారు వారి పాట’ విశేషాలివి…
డైరెక్టర్ పరశురాం గారు ఈ కథ చెప్పాక మీ మొదటి ఫీలింగ్ ఏంటి ?
-పరశురాం గారు మొదట కథ చెప్పినపుడు ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించింది. చాలా పెద్ద యాక్షన్, ఎంటర్ టైనర్ అవుతుందని డైరెక్టర్ గారికి అప్పుడే చెప్పా. తర్వాత పని చేయడం మొదలుపెట్టా.
మహేష్ బాబు గారితో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా వుంటుంది ?
-మహేష్ బాబు గారితో ఇది7 వ సినిమా. సెట్స్ లో చాలా సరదాగా వుంటారు. అదే సమయంలో టెక్నిషియన్ నుంచి అవుట్ పుట్ కూడా అద్భుతంగా రాబట్టుకుంటారు. సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ కి సంబధించిన అన్నీ విషయాలని చర్చిస్తారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారు నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తారు. ఆయన సెట్ లో డ్యాన్స్ చేస్తుంటే విజువల్ ట్రీట్ లా వుంటుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందించారు ?
-మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు సినిమా అంటే చాలా ప్యాషన్. ఎక్కడా రాజీ పడకుండా చిత్రాల్ని నిర్మిస్తారు. కథకు ఏం అవసరమో అది సమకూర్చడానికి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. సినిమా గ్రాండ్ గా రావాలని తపన మైత్రీ మూవీ మేకర్స్ లో వుంది.
‘సర్కారు వారి పాట’ కోసం పెద్ద బ్యాంక్ సెట్ వేశారట కదా.. బ్యాంక్ సెట్ విశేషాలేంటీ ?
-‘సర్కారు వారి పాట’ స్టొరీ పాయింట్ బ్యాంక్ నేపధ్యంలో వుంటుంది. దీని కోసం మూడు బ్యాంకులు అవసరమయ్యాయి. అందులో ఒకటి యాబై ఏళ్ళ క్రితం బ్యాంకు ఎలా వుంటుంది ? అనే దానిపై స్టడీ చేసి, వింటేజ్ లుక్ లో డిజైన్ చేసి, అన్నపూర్ణ స్టూడియో లో సెట్ వేశాం. ఇది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. అలాగే మరో రెండు మోడరన్ బ్యాంక్ సెట్స్ వేశాం.
ఒక కథలో ఆర్ట్ విభాగం ఆవశ్యకత ఏమిటి ?
-దర్శకుడు కథ చెప్పిన తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ఒక ఇమాజినేషన్ చేసుకుంటారు. ఆ కథ ఎలాంటి బ్యాక్డ్రాఫ్ లో ఎలా వుంటుందో చెప్పినప్పుడే ఒక ఊహా ఏర్పడుతుంది. దర్శకులు ఒక విజన్ తో వస్తారు. దానికి ఆర్ట్ డైరెక్టర్ విజన్ తోడౌతుంది. ఈ విజన్స్ నే కెమరా మ్యాన్ క్యాప్చర్ చేయాలి.
సర్కారు వారి పాట టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వగలరా ?
-కథలోనే వుంది. సినిమా బిగినింగ్ లోనే మీకు అర్ధమైపోతుంది
బ్యాంకు కాకుండా మరేమైన సెట్స్ వేశారా ?
-భారీ సినిమా ఇది. ఆర్ట్ వైజ్ చాలా రోజులు పని చేశాం. బ్యాంకు కాకుండా దాదాపు ఎనిమిది సెట్స్ వేశాం. అలాగే ఒక వీధి సెట్ కూడా వుంది. మొదట గోవాలో చేద్దామని అనుకున్నాం. అయితే కొన్ని ప్రాక్టికల్ సమస్యలు వచ్చాయి. మళ్ళీ హైదరాబద్ లోనే ఒక బేసిక్ కాలనీ తీసుకుని దాన్ని వైజాగ్ వీధిలా కథకు తగ్గట్టు డిజైన్ చేశాం. ఇలా ఒకటి కాదు.. చాలా వరకూ సెట్స్ లోనే షూటింగ్ జరిగింది. చాలా ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైన్ చేశాం.
పాన్ ఇండియా సినిమాలు ప్రభావం ఎక్కువైయింది. ఇక్కడి సినిమా కోసం మిగతా పరిశ్రమల ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్ ఇంకా గ్రాండ్ గా వుండలానే ఒత్తిడి ఏమైనా వుంటుందా?
-పాన్ ఇండియా అనే కాదు.. మనం చేసేపని వళ్ళుదగ్గర పెట్టి చేయాలి. లేదంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ వుండదు. బడ్జెట్ కి తగ్గట్టు కథకు ఎంత వరకూ న్యాయం చేయాలని అలోచించడమే తప్పా ఒత్తిడి ఏమీ వుండదు.
సాంగ్స్ కోసం సెట్స్ వలన విజువల్ ని ఇంకా పొయిటిక్ గా చూపించే అవకాశం వుంటుందా ?
-కొన్ని మన ఇమాజినేషన్ కి తగ్గట్టు బయట దొరకవు. మన ఊహకు తగ్గట్టు సెట్ వేస్తే మనం అనుకున్న ఇమాజినేషన్ ని స్క్రీన్ పై ప్రజంట్ చేయగలం. ముఖ్యంగా సాంగ్స్ సెట్స్ మనం ఫీలై చేయాలి తప్పితే నేచురల్ గా దొరకవు. సర్కారు వారి పాట కోసం వేసిన సాంగ్స్ సెట్స్ తెరపై అద్భుతంగా వుంటాయి.
ఏదైనా సెట్ వేయడానికి మీ హోం వర్క్ ఎలా వుంటుంది ?
-ముందు సిట్యువేషన్ ని స్టడీ చేస్తాం. ఉదాహరణ ఒక టెంపుల్ సెట్ వేయాలంటే .. అది నార్త్ లేదా సౌతా ? శివాలయమా ? విష్ణు అలయమా ? ఇలా ప్రతిది స్టడీ చేస్తాం. తర్వాత షూటింగ్ డేస్ చూస్తాం. నెల షూటింగ్ అయితే ఒకలా వారం రోజులు షూటింగ్ జరిగితే మరోలా వుంటుంది. కథలో పర్టికులర్ సెట్ ప్రాముఖ్యతని పరిగణలోకి తీసుకుంటాం.
ఒకప్పుడు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా కొద్దిమంది టెక్నీషియన్స్ పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ ఇప్పుడు ఆర్ట్ డైరెక్ట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది ఆర్ట్ విభాగానికి గోల్డెన్ ఏరా అని భావించవచ్చా ?
-పేరుతో పాటు ఇప్పుడు పని కూడా పెరిగింది. ఇప్పుడు అందరికీ వరల్డ్ సినిమా తెలుసు. డిఫరెంట్ కంటెంట్ చూస్తున్నారు. అవైర్ నెస్ పెరిగింది. అలాగే ఇప్పుడొస్తున్న టెక్నీషియన్స్ అంతా తమ రిక్వైర్మెంట్ ని స్పష్టంగా అడుగుతున్నారు. ఇప్పుడు ఆర్ట్ వర్క్ అంత ఈజీ కాదు.
మహేష్ బాబు గారి ఏడు సినిమాలు చేశారు. ఇందులో ది బెస్ట్ ఆర్ట్ వర్క్ ఏమిటి ? అలాగే కష్టమైనది ఏంటి ?
-కష్టం అనేది లేదు. ప్రతి సినిమాకి ఒకేలా వర్క్ చేస్తాం. కొన్నిటికి మంచి పేరు రావచ్చు. పెద్ద సెట్స్ వుంటే అవార్డ్స్ వస్తాయి. సర్కారు వారి పాట కోసం చాలా వర్క్ చేశాం. ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ ఇలా చాలా డిజైన్ చేశాం. సినిమా చూశాక అసలు ఇది సెట్టా ? అని కనిపెట్టలేరు. అంత నేచురల్ గా వుంటాయి.
దూకుడు` చిత్రానికి ఈ సినిమాకు ఆర్ట్ విషయంలో ఎలాంటి తేడా గమనించారు ?
-అప్పట్లో దూకుడు పెద్ద సినిమా. తర్వాతర్వాత బడ్జెట్ పెరగడంతో పాటు మెటీరియల్, లేబర్ ఖర్చులు కూడా పెరిగాయి. అయితే కథ ప్రకారం ఎంత బడ్జెట్ పెరిగినా నిర్మాతలు రాజీపడకుండా కావాల్సినవి సమకూరుస్తుంటారు.
టెక్నాలజీ పెరిగింది కదా.. పని ఒత్తడి తగ్గిందా ?
-వర్క్ ఇంకా పెరిగింది. ఇంతకుముందు సెట్ మొత్తం వేసేవాళ్ళం. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వేసిన తర్వాత సీజీ అంటారు. సిజీ వాళ్ళకి డిజైన్ ఇవ్వాలి. మన వర్క్ ని మనం డిజైన్ చేసుకోవాలి. గ్రౌండ్ ఫ్లోర్ వేస్తున్నాం కదా మిగిలన దానికి ఎందుకు ఇంత బడ్జెట్ అని నిర్మాతలతో బడ్జెట్ చర్చలు ..ఇలా వర్క్ ఇంకా పెరుగుతూనే వుంది.
కొన్ని సెట్స్ అని సులువుగా తెలిసిపోతాయి. కానీ కొన్ని తెలీవు. ఒరిజినల్ అనిపించే చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ?
-ముందు బాగా స్టడీ చేయాలి. ‘అల వైకుంఠపురంలో ‘ సినిమా దాదాపు సెట్స్ లో చేశాం. కానీ అది సెట్ అని చాలా మందికి తెలీదు. ఇండస్ట్రీ వాళ్ళు కూడా అది ఒరిజినలే అనుకున్నారు. అది నేచురల్ లొకేషన్ అనుకోవడం మాకు మైనస్. అయితే ఒరిజినల్ లొకేషన్ అనిపించేలా సెట్ వేశామనే తృప్తి వుంటుంది. అదే అవార్డ్ తో సమానం.
కెమరామెన్ మధిగారితో మీ వర్క్ ఎక్స్ పిరియన్స్ ?
-మధి గారితో ఇది మూడో సినిమా. మిర్చి, రన్ రాజా రన్.,.. ఇప్పుడు సర్కారు వారి పాట.. ఆయనతో పని చేయడం నైస్ ఎక్స్పీరియన్స్
బడ్జెట్ కంట్రోల్ చేయడానికి మీ దగ్గర వున్న ఫార్ములా ఏమిటి ?
-నేను చేసే బ్యానర్లు చూస్తే మీకే అర్ధమౌతుంది. వాళ్ళు అంతా ప్రొడక్షన్ పై మంచి అవగాహన వున్న వాళ్ళు. ఇంతలో అయితే వర్క్ అవుట్ అవుతుంది. దానికి మించితే ప్రాజెక్ట్ పై భారం పడుతుందని దర్శక, నిర్మాతలతో నేనే ముందే చెప్పేస్తాను.
మన స్టార్స్ కి టెక్నికల్ డిపార్ట్మెంట్ మీద అవగాహన వుంటుందా?
-అద్భుతంగా వుంటుంది. ఎవరు ఎలా వర్క్ చేస్తారో వాళ్లకు బాగా తెలుసు. వాళ్ళే టెక్నిషియన్స్ ని రిఫర్ చేసే స్థాయిలో వున్నారు.
కరోనా తర్వాత సెట్ వర్క్ చేసే కల్చర్ పెరిగిందా ?
-అవును. కరోనా కారణంగా బయట చేయాల్సిన వర్క్ కూడా సెట్ వేసి చేయాల్సివస్తుంది. దీంతో పనితో పాటు బడ్జెట్ కూడా పెరుగుతుంది.
మీ సినిమాలు కాకుండా ఆర్ట్ విభాగంలో లో మీకు బాగా నచ్చిన సినిమా ?
‘బాహుబలి’ అనే చెప్తాను. ఆ సినిమా స్కేల్ అలాంటింది
ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్లు కూడా విదేశాలనుంచి వస్తున్నారు కదా?
-ఆర్ట్ డైరెక్టర్లె కాదు కెమరామెన్ తో సహా చాలా మంది టెక్నీషియన్లు విదేశాల నుంచి వచ్చి పని చేస్తున్నారు. ప్రేక్షకులు, నిర్మాతలు తప్పా టెక్నికల్ టీమ్ లో కొందరు ఫారిన్ నుండి వచ్చి పనిచేస్తున్న సందర్భాలు వస్తున్నాయి.
భవిష్యత్ లో ఎలాంటి సెట్స్ వేయాలని కోరుకుంటున్నారు ?
-సోషియో ఫాంటసీ సినిమాలు చేయాలనీ వుంది.
కొత్తగా చేస్తున్న సినిమాలు ?
-చిరంజీవి గారి భోళాశంకర్, చిరంజీవి – డైరెక్టర్ బాబీ, బాలకష్ణ- మలినేని గోపీచంద్ సినిమా, త్రివిక్రమ్-మహేష్ బాబు, వెంకటేష్ – వరుణ్ తేజ్ – అనిల్ రావిపూడి F3 సినిమాలకి చేస్తున్నా.