సరస్వతి పుత్రుడు ‘కందికొండ’ని కాపాడుకుందాం..

Spread the love

ప్రముఖ సినీ గేయ రచయిత, శాలివాహన ముద్దు బిడ్డ, సరస్వతి పుత్రుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, కష్టపడి చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీలో పీ.హచ్. డి పూర్తి చేసుకొని మన తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలను, పండుగల విశష్టతలను, విశేషాలను తెలియజేసే ఎన్నో పాటలని రాసిన “కందికొండ గిరి ” ప్రస్తుతం త్రోట్ క్యాన్సర్ వ్యాధితో భాధపడుతూ గత కొన్ని రోజులుగా హస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
జీ.హెచ్. ఎం.సి, తెలంగాణ బోనాల పాట, సమ్మక్క సారక్కల పాట, కాళేశ్వరం పాట, దీపావళి పాట,సంక్రాంతి పాట మరియు ఎన్నో హిట్ సినిమాలైన దేశముదురు,పోకిరి,మున్నా,ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి మరెన్నో చిత్రాలలో దాదాపు 1200 పాటలు రాసాడు.
గత 15 రోజుల నుండి అపోలో హస్పిటల్ లో చికిత్స నిమిత్తం అత్యధికంగా వైద్య ఖర్చులైనవి. ఇప్పుడు ప్రస్తుతం కిమ్స్ హస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నది. వెంటిలెటర్ పై సికింద్రాబాద్ దగ్గర లోని కిమ్స్ హస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.. వెంటిలెటర్ ఛార్జెస్ ఒక రోజు కి 70,000 రూపాయలు మరియు మెడిసిన్స్, బెడ్ ఛార్జెస్ అన్ని సపరేటు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి వన్నె తెచ్చిన పాటలు రాసిన కందికొండ గిరి గారు ప్రస్తుతం హస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నందున దయచేసి మనందరం కూడా మనకి తోచిన ఆర్థిక సహయం చేద్దాం.
సరస్వతి పుత్రుడిని కాపాడుకుందాం. తీవ్ర అస్వస్థతకు గురైన కందికొండకు దాతలు ఎవరైనా సహాయం చేయాలనుకొంటే.. అతడి భార్య గూగుల్ పే & ఫోన్ పే నెంబర్ 8179310687 తమకు తోచిన విధంగా సాయం చేయవచ్చు.

Related posts

Leave a Comment