డాక్టర్ రవికిరణ్ గడలి దర్శకత్వంలో ‘మెరూన్ వాటర్స్ ఎక్స్ లెన్స్’ పతాకంపై డాక్టర్ ప్రతిమారెడ్డి నిర్మించిన సందేశభరిత వినోదాత్మక చిత్రం ‘రాంగ్ స్వైప్’. క్షణిక సుఖం కోసం పక్క దారి పడితే… ఎటువంటి విపరిణాలను ఎదుర్కోవలసి వస్తుందో ఎంటర్టైనింగ్ వేలో చూపించే ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘ఊర్వశి ఓటిటి’ ద్వారా నవంబర్ 1న విడుదల కానుంది. స్వతహా డాక్టర్ అయిన రవికిరణ్… సినిమా మాధ్యమం పట్ల విపరీతమైన ప్యాషన్ తో.. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు స్వయంగా సమకూర్చుకుని, దర్శకత్వం వహించడంతోపాటు… ఛాయాగ్రహణం కూడా అందించడం విశేషం. అంతేకాదు, ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కూడా పోషించారు. డాక్టర్ ఉదయ్ రెడ్డి, డాక్టర్ శ్రావ్యనిక, రాధాకృష్ణ, అనికా ప్రేమ్ ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాత డాక్టర్ ప్రతిమారెడ్డి మాట్లాడుతూ… ”లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మా డైరెక్టర్ డాక్టర్ రవికిరణ్ చాలా గొప్పగా తీర్చిదిద్దారు. అన్నీ తానే అయి ముందుండి నడిపించారు. మెసేజ్ కి ఎంటర్టైన్మెంట్ జోడించి రూపొందిన ‘రాంగ్ స్వైప్’ అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. కబీర్ రఫీ సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు” అన్నారు.
Related posts
-
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ... -
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్
Spread the love సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక... -
Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan
Spread the love Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in...