మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, అనిల్ సుంకర భోళా శంకర్కి ముహూర్తం ఫిక్స్

Megastar Chiranjeevi, Meher Ramesh, Anil Sunkara’s Bholaa Shankar Muhurtham Fixed
Spread the love

మెగాస్టార్ చిరంజీవి, స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రాబోతోన్న భోళా శంకర్ సినిమా ముహూర్తం ఫిక్స్ అయింది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతోంది. నవంబర్ 11 ఉదయం 7:45 గంటలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. నవంబర్ 15 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అన్నాచెల్లెళ్ల బంధం చుట్టు తిరిగే ఈ కథలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. చిరంజీవి సరసన నటించే హీరోయిన్‌ పేరును అతి త్వరలో ప్రకటించనున్నారు మేక‌ర్స్‌. యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌కు ఆయన అందించిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భోళా శంకర్ సినిమా ని
అనిల్ సుంకర గ్రాండ్ గా నిర్మిస్తున్నారు క్రియేటివ్ కమర్షియల్ భాగస్వామ్యం తో. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక బృందాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు. భోళా శంకర్ 2022లో విడుదల కానుంది.
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్
సాంకేతిక బృందం:
డైరెక్టర్ : మెహర్ రమేష్
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
బ్యానర్ : ఏకే ఎంటర్టైన్మెంట్స్,
మ్యూజిక్ : మహతి స్వర సాగర్

Related posts

Leave a Comment