ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది : ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.ఏ ఏజాస్

Aler republicday news
Spread the love

* ఆలేరు ఇందిరా కాంగ్రెస్ భవనం వద్ద ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని, మనకు ఈ రాజ్యాంగాన్ని అందించిన దార్శనికులకు నివాళులర్పిస్తున్నామని ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.ఏ ఏజాస్ పేర్కొన్నారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఇందిరా కాంగ్రెస్ భవనం వద్ద ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.ఏ ఏజాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేసిన అనంతరం ఏజాస్ మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కీలక చట్టాలు తెచ్చి దేశాన్ని కాంగ్రెస్ శక్తివంతంగా తీర్చిదిద్దిందని ఆయన తెలిపారు. మోదీ, కేసీఆర్ లాంటి నాయకులు ప్రజలను పట్టి పీడిస్తున్నారన్నారు. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులు కాలరాస్తోందరన్నారు. పార్లమెంట్‌లో చర్చలకు తావులేకుండా బిల్లులు ఆమోదిస్తున్నారన్నారు. మోదీ రాజ్యంలో మోదీ చక్రవర్తి అయితే కేసీఆర్ సామంత రాజు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అయన వాపోయారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో విలేకరులు, కవులు, ప్రజా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయన్నారు. పాలకులు రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. తెలంగాణలో భిన్నమైన పాలన కొనసాగుతోందని అయన విమర్శించారు.
ఈ సందర్బంగా జరిగిన జెండా ఆవిష్కరణోత్సవంలో జెడ్పీటీసీ కుడుదుల నగేష్, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, సింగిల్ విండో డైరెక్టర్ కట్టేగొమ్ముల సాగర్ రెడ్డి, ఎస్సీ సెల్ కన్వీనర్ నీలం వెంకటస్వామి, సీనియర్ నాయకులు ఎగ్గిడి యాదగిరి ,మాజీ ఎంపీటీసి జైనొద్దీన్ , ఎగ్గిడి శ్రీశైలం, సీనియర్ నాయకులు సత్యం, కద్దగట్ల నరేందర్, ఓబీసీ టౌన్ అధ్యక్షులు సతీష్, మన్నే సంతోష్ ,వైస్ ప్రెసిడెంట్ దడిగే అనిల్, మహిళా అధ్యక్షురాలు పాము అనిత, ప్రధాన కార్యదర్శి మల్లెల శ్రీకాంత్, సంగపాక పూర్ణచెందర్, పర్రె రమేష్, పటేల్ గూడెం గ్రామ అధ్యక్షులు జహంగీర్, యువజన నాయకులు నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ పల్లె సంతోష్, ప్రధాన కార్యదర్శి కర్రె అజయ్, టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జుకంటి సంపత్, ఆలేరు మండల్ అధ్యక్షులు కలకుంట్ల లోకేష్, వైస్ ప్రెసిడెంట్ బిసా కిరణ్, చిన్నం రాజు ,బోడ మహేష్, నాగరాజు, టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాసుల భాస్కర్, వెళ్ళ నవీన్, ప్రభు, శ్రీను, ఎన్.ఎస్.యు.ఐ టౌన్ అధ్యక్షులు జావీద్, మైనారిటీ టౌన్ అధ్యక్షులు ఎం.డి. బాబా, ఎం.డి. షమ్మీ తదితరులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment