అందం.. అభినయంతో అందర్నీఆకట్టుకుంటున్నబుట్ట బొమ్మ పూజా హెగ్డే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఈ అమ్మడి గ్లామర్ కు ఫ్యాన్సు ఎంతగానో ఫిదా అయిపోతున్నారు. దాంతో మూవీ మేకర్సు సైతం పూజాకే ప్రయారిటీ ఇస్తున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఎన్నో ఆసక్తికరమైన ప్రాజెక్టులు క్యూకట్టాయి. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రభాస్ ‘రాధే శ్యామ్’తో బాటు.. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’కూడా ఉన్నాయి. ఇవే కాకుండా.. బాలీవుడ్ స్క్రీన్ పైనా తళుక్కున మెరవనుంది. రణవీర్ సింగ్ రోహిత్ శెట్టితో కలిసి ‘క్రికస్’ మూవీలోనూ నటిస్తోంది.
మరోవైపు సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘కబీ ఈద్ కబీ దివాళి’లోనూ ఆడిపాడబోతోంది పూజా. పూజా హెగ్డే.. లక్ మాములుగా లేదుగా.. తాజాగా ఈ భామ మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్సు కొట్టేసిందట. దీంతో ఈ బుట్టబొమ్మ ఎగిరి గంతేసినంత పని చేస్తోంది. తెలుగుతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలోని హీరోలకు హాట్ ఫేవరేట్‌గా మారింది. టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో మంచి ఊపుమీదుంది. గతేడాది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలో మెరిసింది. ఆ తర్వాత అక్కడ కూడా బిజీ అయింది. ఇపుడు సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దీవాళీ’ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది. తాజాగా ఈ భామకు మరో బంపరాఫర్ తగిలింది. కన్నడ భామగా తెలుగు,తమిళం,హిందీలో యాక్ట్ చేసిన ఈ భామ.. తాజాగా ప్రభాస్, ప్రశాంత్ నీల్ భారీ ప్రాజెక్ట్ ‘సలార్’లో పూజా హెగ్డేనే మెయిన్ హీరోయిన్‌గా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే పూజా.. ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తోంది. ఈమెను సలార్ మూవీలో తీసుకోవడానికి అసలు కారణం ఆమె నేటివ్ ప్లేస్ కర్ణాటకే కావడం. ‘సలార్’ సినిమాను ప్రశాంత్ నీల్.. ఎక్కవ మంది కన్నడ నటీనటులతో తెరకెక్కిస్తున్నాడట. అందుకే హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. ఇక పూజా హెగ్గే కూడా మాతృ భాష కన్నడలో ఇంత వరకు ఒక్క సినిమాలో యాక్ట్ చేయలేదు. ఇపుడా అవకాశం ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా ‘సలార్’ మూవీతో దక్కించుకుబోతుంది. ఈ సినిమాను కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కేజీఎఫ్ సినిమాను నిర్మిస్తున్న విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే ఈ సినిమా కోసం బల్కుగా డేట్సు కేటాయించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ భామ.. సల్మాన్ సినిమా తర్వాత ప్రభాస్ సినిమా కోసం మరోసారి రంగంలోకి దిగనుంది. ఒక రకంగా తన సొంత భాషలో నటించడం పై పూజా హెగ్డే ఆనందం వ్యక్తం చేస్తోందట. తొలిసారి కన్నడ భాషలో అది క్రేజీ ప్యాన్ ఇండియా మూవీతో ఎంట్రీ ఇవ్వడం పై ఆనందం వ్యక్తం చేస్తుందట. తెలుగులో పూజా హెగ్డే నాగ చైతన్య హీరోగా నాగార్జున నిర్మించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో పరిచమైంది. అంతకు ముందు ఈమె తమిళంలో జీవా హీరోగా నటించిన ‘మూగముడి’లో నటిచింది. ఆ తర్వాత పూజా హెగ్డే.. వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మగా మురిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో పలకరించింది.ఆ సినిమా సక్సెస్ కాకపోవడంత హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో పూజా తన గ్లామర్‌తో ఆడియన్సును ఫిదా చేసింది. ఆ తరవాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ‘రంగస్థలం’లో ఐటెం భామగా పలకరించింది. ఆపై ‘సాక్ష్యం’ సినిమాలో బెల్లంకొండతో ఆడిపాడింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’లో అరవిందగా టైటిల్‌లో రోల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘మహర్షి’, ఆపై త్రివిక్రమ్ , అల్లు అర్జున్‌తో రెండోసారి ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో హాట్రిక్ సక్సెస్ అందుకుంది.