పి.ఆర్.ఎస్.ఐ అవార్డుకు తిరున‌గ‌రి శ్రీ‌నివాస్ ఎంపిక కావడం ఆలేరుకు గర్వకారణం : బొట్ల పరమేశ్వర్ (మాజీ జెడ్.పి.టి.సి-ఆలేరు)

tsv photo
Spread the love

ప్ర‌పంచ స్థాయి గుర్తింపును పొందిన జాతీయ ప్ర‌జా సంబంధాల సంస్థ ప‌బ్లిక్ రిలేష‌న్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పి.ఆర్.ఎస్.ఐ) 2020-21 సంవ‌త్స‌రానికి ఇచ్చే పి.ఆర్ బెస్ట్ కౌన్సిల‌ర్ అవార్డుకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప‌ట్ట‌ణానికి చెందిన విద్యావేత్త, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు తిరున‌గ‌రి శ్రీ‌నివాస్ ఎంపిక‌ కావడం ఆలేరుకు గర్వకారణం అని మాజీ జెడ్.పి.టి.సి బొట్ల పరమేశ్వర్ అన్నారు. పి.ఆర్‌.ఎస్‌.ఐ గోల్డెన్ జూబ్లీ ఇయ‌ర్ సంద‌ర్భంగా రెండు ద‌శాబ్దాల‌కు పైగా మాస్ మీడియా, జ‌ర్న‌లిజం కోర్సుల‌ను దూర‌ విద్య విధానంలో విశ్వ‌విద్యాల‌య స్థాయిలో ప‌లు ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ జ‌ర్న‌లిజం శిక్ష‌ణా సంస్థ‌లు, క‌ళాశాల‌ల్లో నిరంత‌ర అత్యుత్త‌మ బోధ‌న‌కు గాను శ్రీ‌నివాస్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన‌ట్టు పి.ఆర్.ఎస్‌.ఐ తెలిపింది. ఈ నెల 6న సాయంత్రం 4గంట‌ల‌కు ద‌క్షిణాది ప్రాంత‌మైన హైద్రాబాదులో పి.ఆర్‌.ఎస్‌.ఐ, సివిఎన్ పిఆర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో సంయుక్తంగా నిర్వ‌హించ‌నున్న పి.ఆర్‌.ఎస్‌.ఐ గోల్డెన్ జూబ్లీ కార్య‌క్ర‌మంలో శ్రీ‌నివాస్ కు ప్ర‌ముఖుల చేతుల మీదుగా ఈ అవార్డును అంద‌జేయ‌నున్నారు. అవార్డుకు ఎంపికైన శ్రీ‌నివాస్‌కు పి.ఆర్.ఎస్‌.ఐ జాతీయ అధ్య‌క్షులు డా. అజిత్ పాఠ‌క్‌, కార్య‌ద‌ర్శి వై బాబ్జి, జాతీయ ఉపాధ్య‌క్షులు యు.ఎస్‌.శ‌ర్మ, సివిఎన్ పిఆర్‌ ఫౌండేష‌న్ తో పాటు హైద్రాబాద్ ఛాప్ట‌ర్ బాధ్యులు అభినంద‌న‌లు తెలిపారు.
తిరున‌గ‌రి శ్రీ‌నివాస్ కు అభినందనలు :
ప్ర‌పంచ స్థాయి గుర్తింపును పొందిన జాతీయ ప్ర‌జా సంబంధాల సంస్థ ప‌బ్లిక్ రిలేష‌న్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పి.ఆర్.ఎస్.ఐ) 2020-21 సంవ‌త్స‌రానికి ఇచ్చే పి.ఆర్ బెస్ట్ కౌన్సిల‌ర్ అవార్డుకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప‌ట్ట‌ణానికి చెందిన విద్యావేత్త, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు తిరున‌గ‌రి శ్రీ‌నివాస్ ఎంపిక‌ కావడం ఆలేరుకు గర్వకారణం అని 1984-85 ఎస్.ఎస్.సి బ్యాచ్ కు చెందిన సహచర విద్యార్థులు శుభాకాంక్షలు అందజేశారు. తిరున‌గ‌రి శ్రీ‌నివాస్ కు పి.ఆర్ బెస్ట్ కౌన్సిల‌ర్ అవార్డు రావడం మా అందరికీ గర్వకారణమని నంది అవార్డు గ్రహీత ఎం.డి. అబ్దుల్, మాయ శ్రీనివాస్ శుభాకాంక్షలు అందజేశారు.

Related posts

Leave a Comment