నాని ‘ట‌క్ జ‌గ‌దీష్’ నుండి ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ పాడిన‌ ‘ట‌క్ సాంగ్’ విడుద‌ల‌

tuck song From Nani's Tuck Jagadish Out
Spread the love

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన టక్ జగదీష్ ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరివంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో ఈ చిత్రం రూపొందు‌తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాటలు శ్రోత‌ల‌ను అల‌రిస్తుండగా టీజ‌ర్‌, ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ అందరి ప్రశంసలను గెలుచుకుంది. ఈ రోజు గోపి సుందర్ స్వరపరిచిన ఈ చిత్రంలోనిటక్ పాట`ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఈ సారి ఒక ఇంటెన్స్ నెంబ‌ర్ సాంగ్‌తో మ‌న‌ముందుకు వ‌చ్చారు. ఈ పాటను ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ స్వయంగా పాడ‌డం విశేషం. ఈ పాట యొక్క శైలికి తగ్గ‌ట్టుగా ఆయ‌న వాయిస్ చాలా ఎన‌ర్జిటిక్‌గా ఉంది. ఈ పాట‌లో నాని మాస్‌, యాక్షన్ అవతారంలో క‌నిపించ‌నున్నారు. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ట‌క్ జ‌గ‌దీష్ వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్‌10 నుండి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. రీతు వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య రాజేష్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది, నాని సోద‌రుడిగా విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌నున్నారు. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.
తారాగ‌ణం: నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ త‌దిత‌రులు
సాంకేతిక బృందం: ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌, నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది, సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌, గోపి సుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఫైట్స్‌: వెంక‌ట్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌), కో- డైరెక్ట‌ర్‌: ల‌క్ష్మ‌న్ ముసులూరి, క్యాస్టూమ్, డిజైన‌ర్‌: నీర‌జ కోన‌, ప‌బ్లిసిటి డిజైన‌ర్‌: శివ కిర‌ణ్‌(వ‌ర్కింగ్ టైటిల్‌)‌, పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌

Related posts

Leave a Comment