‘డిజె టిల్లు’ ట్రైలర్ విడుదల… ఫిబ్రవరి 11న సినిమా విడుదల
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డిజె టిల్లు’, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో బుధవారం ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు చిత్రబృందం స్పందన ఇది….
డిజె టిల్లు ట్రైలర్ చూస్తే..కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంది. అందమైన అమ్మాయి రాధికను సొంతం చేసుకునేందుకు డిజె టిల్లు అన్ని ప్రయత్నాలూ చేస్తుంటాడు. అల్లు అర్జున్ కొత్త సినిమాకు మ్యూజిక్ చేయబోతున్నానంటూ అతను చెప్పుకునే గొప్పలు, చేసే అల్లరి పనులు ఆకట్టుకున్నాయి. నేను నిన్ను హోల్ హార్టెడ్ గా లవ్ చేసిన రాధిక, తెలిసే నన్ను హౌలాగాడిని చేస్తున్నావ్ సో స్వీట్ ఆఫ్ యూ రాధికా వంటి డైలాగ్స్ పేలాయి. రాధిక తనొక్కరికే సొంతం కాదని తెలిసినప్పుడు డిజె టిల్లు అసహనం నవ్విస్తుంది. రాధిక టిల్లుకే దక్కిందా?, ఇంకెవరి ప్రేమనైనా అంగీకరించిందా? అనే అంశాలు సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నాయి.
‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‘ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ “ఈ ఏడాది మా సంస్థ నుంచి మూడు చిన్న సినిమాలు వస్తాయి. మధ్యలో పెద్ద సినిమా ‘భీమ్లా నాయక్’ కూడా ఉంది. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న ఆ సినిమా విడుదల చేస్తాం/ ‘డిజె టిల్లు’ యూత్ సినిమా. ‘భీమ్లా నాయక్’ మాసివ్ సినిమా. ‘డిజె టిల్లు’ ఫిబ్రవరి 11న విడుదల చేస్తాం. నాకు బాగా నచ్చిన కథ డిజె టిల్లు. కథ నచ్చడంతో కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించాం. దీని మీద మాకు చాలా నమ్మకం ఉంది. గ్యారెంటీ గా విజయం సాధిస్తుంది అన్నారు.
సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ “ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. విమల్ కృష్ణ, నేను డిస్కస్ చేసుకుని కథ, స్క్రీన్ ప్లే రాశాం. డైలాగ్స్ నేను రాశా. థియేటర్ లో మీరు బాగా నవ్వుకుంటారు. నేను జీవితంలో చూసిన సందర్భాలు, మనుషులు, నా స్వభావాలు కొన్ని కలిపి ఈ క్యారెక్టర్ రాసుకున్నాము. డిజె టిల్లు పాత్రకు హద్దులు ఉండదు, ఏదైనా మాట్లాడుతాడు. ఏ సందర్భానైన్నా ఎదుర్కొంటాడు. త్రివిక్రమ్ గారు స్క్రిపు విషయంలో మంచి సలహాలు ఇచ్చి ప్రోత్సహించారు. నిర్మాత వంశి మాకు పూర్తిగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా రాసేటప్పుడు మాకు అండగా నిలబడిన త్రివిక్రమ్ గారికి థాంక్స్ చెప్పాలి. కొన్నిసార్లు మా సినిమా పొటెన్షియల్ ఏంటో ఆయన మాకు గుర్తు చేసేవారు. రచయితగా నా మీద ఆయన ప్రభావం ఉంది. జంధ్యాల గారి ప్రభావం కూడా ఉంది. డైలాగులతో కథను ముందుకు తీసుకువెళ్లే సినిమాలు నాకు ఇష్టం. స్పేస్ లేనిచోట ఎలా క్రియేట్ చేయాలో ఆయన్ను చూసి తెలుసుకున్నాను. త్రివిక్రమ్ గారితో టైం స్పెండ్ చేస్తే ఏమైనా చేయవచ్చనే ఫీలింగ్ వస్తుంది. ఒక ఫార్మాట్ ప్రకారం ప్లాన్ తో చేసిన సినిమా కాదు. మా నిర్మాత వంశీ గారు దేనికీ నో చెప్పరు. అప్పుడప్పుడూ మేం ఇంత ఖర్చు పెట్టొద్దని అన్నాం. కానీ, ఆయన ఎక్కడా తగ్గొద్దని చెప్పారు. కావాలంటే సీన్లు మళ్ళీ తీయమని చెప్పారు. నేను నెక్స్ట్ సినిమా కూడా సితారలో చేస్తున్నాను. దాని తర్వాత ఇంకో సినిమా కూడా చేస్తున్నాను. నాకు సితార హోమ్ బ్యానర్ లాంటిది. నేను, విమల్ ఫస్ట్ కొవిడ్‌లో రాసిన కథ. చాలా నేచురల్ ప్రాసెస్ లో రాశాం. 100 పర్సెంట్ కొడుతున్నాం. ఇది చాలా ఎంటర్టైనింగ్ ఫిలిం. థియేటర్లకు వెళ్లిన అందరూ కళ్లల్లో నీళ్లు వచ్చేలా నవ్వుతారు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఈ సినిమా అమ్మాయి గురించి. ఆమె జీవితంలోకి డిజె టిల్లు లాంటి క్యారెక్టర్ వస్తే ఏం జరిగిందనేది సినిమా. యూత్ కు రిలేట్ అయ్యేలా సినిమా తీశాం” అని అన్నారు.
దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ “ఫస్ట్ లాక్‌డౌన్‌లో నేను, సిద్ధు కథ మీద కూర్చున్నప్పుడు… సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు జనాల్ని నవ్వించాలనే మోటివ్ తో ఉన్నాం. టీజర్ చూశారు. ఇప్పుడు ట్రైలర్ చూశారు. ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ మూవీ. ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు.
నన్నూ సిద్దూని నమ్మారు నిర్మాత వంశి అన్న. రెండేళ్ల కిందట నేనూ సిద్ధూ ఈ కథ రాసుకున్నాం. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు నవ్వుకోవాలి అనేది ఒక్కటే మా ఆలోచనలో ఉండేది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ సినిమా ఇది. అన్నారు.
హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ…డిజె టిల్లు ట్రైలర్ నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత పెద్ద చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాత వంశి గారికి థాంక్స్. రాధిక క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మిన దర్శకుడు విమల్ కూడా థాంక్స్. సిద్ధు మల్టీటాలెంటెడ్. అతనితో కలిసి పనిచేయడం సరదాగా ఉండటమే కాదు ఎంతో నేర్చుకున్నాను. డిజె టిల్లు ఫన్, మాస్ ఎంటర్ టైనింగ్ సినిమా. నేను కథ విన్నప్పుడు ఎంతగా ఎంజాయ్ చేశానో సినిమా చూస్తున్నప్పుడు మీరూ అంతే ఆస్వాదిస్తారు అన్నారు.
ప్రిన్స్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన వంశీ అన్నకు థాంక్యూ. చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాం. చాలా రోజుల తర్వాత సిద్ధూతో కాంబినేషన్ లో చేశా. బయట మేం ఎంత ఎంజాయ్ చేస్తామో, సెట్ లో కూడా అంతే ఎంజాయ్ చేశాం. ఈ సినిమాతో నాకు ఇద్దరు కొత్త ఫ్రెండ్స్ విమల్ కృష్ణ, నేహా శెట్టి పరిచయం అయ్యారు. ఈ సినిమాతో నాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదొక ఫన్ ఫిల్మ్. వంశీ అన్నకు ముందే కంగ్రాట్స్ చెబుతున్నా. సిద్దు పెద్ద హిట్ కొడుతున్నాడు” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ రెడ్డి, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
మాటలు: సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నేపథ్య సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ