మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా జీ 5 దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 భాషల్లో అన్లిమిటెడ్ కంటెంట్‌ను అందిస్తోంది. ఇప్పటికే క్రేజీ సినిమాలు, ఒరిజినల్స్, టాక్ షోస్ అంటూ డిఫరెంట్ కంటెంట్‌ను అందిస్తూ తనదైన స్థానాన్ని దక్కించుకున్న జీ 5 దూసుకెళ్తోంది. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ నుంచి వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ’ అనే కామెడీ డ్రామా చిత్రం , అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి లాసర్ 2, బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ నుంచి ‘గాలి వాన’, ‘రేసీ’, హల్ వరల్డ్ మా నీళ్ల ట్యాంక్, అహ నా పెళ్లంట, రీసెంట్గా ఏటీఎం వంటి ఒరిజినల్స్‌ను ప్రేక్షకులకు అందించింది జీ 5. తాజాగా ఇప్పుడు జీ 5 లైబ్రరీలో మరో వైవిధ్యమైన ఒరిజినల్ చేరబోతుంది.. అదే ‘పులి మేక’.
సిల్వర్ స్క్రీన్‌పై ఆడియెన్స్‌ని అలరించిన లావణ్య త్రిపాఠి జీ 5, కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ కాంబోలో రూపొందిన ‘పులి మేక’ ఒరిజినల్‌తో ఓటీటీలోకి అడుగు పెట్టేశారు. ఈ ఒరిజినల్లో ఆమె ప్రధాన పాత్రధారిగా నటిస్తున్నారు. ఆమెతో పాటు ఆది సాయికుమార్, సిరి హన్మంత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 24 నుంచి ఈ ఒరిజినల్ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్గా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘పులి మేక’ టీజర్‌ను విడుదల చేయగా అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ జోష్ తగ్గక ముందే మహా శివరాత్రి సందర్భంగా లావణ్య పాత్రలోని హీరోయిక్ యాంగిల్‌ను ఎలివేట్ చేసే స్పెషల్ గ్లింప్స్‌ను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రిలీజ్ చేశారు.
కె.చక్రవర్తి రెడ్డి తెరకెక్కించిన ‘పులి మేక’ గ్లింప్స్‌ను గమనిస్తే అందులో లావణ్య ముఖమంతా పసుపు పుసుకుని అమ్మోరులాంటి వేషదారణలో కనిపిస్తుంది. అలాగే చీర కట్టులో ఆమె చేసిన యాక్షన్ అన్ని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. ‘పులి మేక’లో లావణ్య త్రిపాఠి కిరణ ప్రభ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా నటించింది. ఈ గ్లింప్స్‌ను చూస్తుంటే లావణ్య ఈ పాత్రలో నటించటానికి ఫిజికల్‌గా మెంటల్‌గా చాలానే కష్టపడినట్లు స్పష్టమవుతుంది.
‘పులి – మేక’ థ్రిల్లింగ్ జోనర్లో రూపొందిన ఈ వెబ్ ఒరిజినల్ కోసం కోన ఫిల్మ్ కార్పొరేషన్‌తో జీ5 చేతులు కలిపింది. ఓ సీరియల్ కిల్లర్ ఏకంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌నే టార్గెట్ చేస్తాడు. ఒకరి తర్వాత ఒకరిని చంపేస్తుంటాడు. అప్పుడు కిల్లర్‌ను పట్టుకోవటానికి పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన ప్రయత్నాలే పులి మేక ఒరిజినల్. పూర్తి వివరాలు తెలియాలంటే ఫిబ్రవరి 24న జీ5ని ట్యూన్ చేయండి.
నటీనటులు:
ప్రభాకర్ శర్మగా ఆది సాయి కుమార్, కిరణ్ ప్రభగా లావణ్య త్రిపాఠి, అనురాగ్ నారాయణ్‌గా సుమన్, దివాకర్ శర్మగా గోపరాజు, రాజాగా కరుణాకర్ శర్మ, సిరిగా పల్లవి, శ్రీనివాస్‌గా పాండు రంగారావు, స్పందనగా పల్లవి శ్వేత నటిస్తున్నారు.
సాంకేతిక వర్గం:
బ్యానర్స్: జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేషన్
కన్విన్సిడ్, క్రియేటెడ్: కోన వెంకట్
దర్శకుడు : చక్రవర్తి రెడ్డి.కె
సినిమాటోగ్రఫీ: రామ్ కె.మహేష్
ప్రొడక్షన్ డిజైన్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్
స్టోరి రైటర్స్: కోన వెంకట్, వెంకటేష్ కిలారు
కాస్ట్యూమ్స్: నీరజ కోన
పాటలు: శ్రీ