ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన యం. ముత్తు దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా చిక్లెట్స్. తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాను యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఈ సినిమాలో బాలనటుడిగా సుపరిచితుడైన సాత్విక్ వర్మ, జాక్ రాబిన్ సన్, రీజీమ్ హీరోలుగా నటిస్తుండగా.. నయన్ కరిష్మా, అమిర్తా హల్దార్, మంజీరాలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.ఎస్.ఎస్.బి ఫిల్మ్ బ్యానర్‌లో ఏ శ్రీనివాసన్ గురు ఈ సినిమాను రెండు భాషల్లో నిర్మిస్తున్నారు. పూర్తి యూత్ కంటెంట్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. బాలమురళి బాలు సంగీతాన్ని అందిస్తున్నారు. అజిత్ వలిమై సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన విజయ్ వేలుకుట్టి ఈ సినిమాను ఎడిట్ చేస్తున్నారు. కొలంచి కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విడుదల చేసారు.
సాత్విక్ వర్మ, జాక్ రాబిన్ సన్, నయన్ కరిష్మా, అమిర్తా హల్దార్, మంజీరా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు: యం ముత్తు, నిర్మాత: శాంతి శ్రీనివాసన్, బ్యానర్: ఎస్.ఎస్.బి ఫిలిం, సంగీతం: బాలమురళి బాలు, సినిమాటోగ్రఫీ: కొలంచి కుమార్, ఎడిటర్: విజయ్ వేలుకుట్టి, పి.ఆర్.ఓ : ఏలురు శ్రీను, మేఘ శ్యామ్.
‘చిక్లెట్స్’ ఫస్ట్ లుక్ విడుదల
