నిశ్శబ్దంగా మసిలే జీవి అమ్మ.
అమ్మ ఏమైనా చేయగలదు. ఎందుకో అమ్మలో ఈ పిచ్చి ప్రేమ.
ఎందుకని అమ్మలందరూ పిచ్చిగా ప్రేమిస్తారు.
ఊరికెనే ప్రేమిస్తారు.
ఏ స్వార్థం లేకుండా ఎందుకు ప్రేమిస్తారో ఈ అమ్మలు.
పిచ్చి అమ్మలు.
పిల్లలను కళ్ళల్లో పెట్టుకొని జీవిస్తారెందుకో.
అమ్మతనం ఎందుకో లోకానికి పిచ్చిగా తోస్తుంది.
ఎందుకీ అమ్మలు నిశ్శబ్దంగా, నిరాడంబరంగా ఉంటారు?
ఎందుకీ అమ్మలు రాజీ పడనంత ప్రేమతో నిండు కుండల్లా ఉంటారు.
లేకపోతే
అమ్మ నిస్వార్థ ప్రేమ చింతనకు హంతకుడే కదిలి రావడమేమిటి?
కొడుకుని చంపిన హంతకుడికైనా ప్రేమగా సపర్యలు చేసే అమ్మ క్షమకు సాటి ఏదైనా ఉందా?సాధారణంగా ప్రారంభమై సాగుతున్నా కొద్దీ అసాధారణంగా ఉత్థాన స్థితికి తీసుకెళ్తుందీ సినిమా.
ప్రేమను హత్తుకున్న అక్షరాలతో కూడిన పత్రికా ఉత్తరాలు ఎంతటి కఠిన హృదయాలనైనా కరిగిస్తాయి.
మనవైన కథలు, మనవైన పరిసరాల్లో,
మనదైన భాషతో వచ్చే సినిమాలు ఎంతగా హత్తుకుంటాయో.
సామాజికంగా మార్పు కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఈ అమ్మ కచ్చితంగా ఉత్ప్రేరకమే!
అందరూ చూడాల్సిన సినిమా. సోనీ లివ్ లో ఉంది.
నోట్: సినిమా చూస్తుండగా రాసిన అక్షరాలు. ఎందుకో ఎడిట్ చేయాలనిపించలేదు.