నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సంగు భూపతి ఆధ్వర్యంలో రాస్తారోకో
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సంగు భూపతి ఆధ్వర్యంలో ఆలేర్ అసెంబ్లీ కేంద్రంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన బీజేవైఎం జిల్లా ప్రథాన కార్యదర్శి కమటం ప్రశాంత్ తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఉద్యోగాల కల్పనను తన ఇంటికే పరిమితం చేశారన్నారు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తూ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం కొట్లాడిన విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దని, గత రెండేళ్లుగా ఇటు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక అటు నిరుద్యోగ భృతి చెల్లించక ప్రభుత్వం చెప్పిన హామీల అమలు ఎడారిలో ఎండమావిగానే మారిందన్నారు, ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుంటే ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని ఆయన హెచ్చరించారు.కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఎడుముల్ల ఆంజనేయులు, జిల్లా అధికార ప్రతినిధి మజిక నరేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు ఈడం రాజశఖర్,పొనగని రవీందర్,శేకర్ రెడ్డి,సీనియర్ నాయకులు దయ్యాల కుమార స్వామి,కళ్లెం మహేష్, కోల నరేష్, తదితరులు పాల్గొన్నారు.